ఈ మద్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఇదంతా మోదీ మానియా అని, ఆయన చేసి మంచి పనులు ప్రజలకు మంచి విశ్వాసం కలిగిందని..అందుకే ఆయనను రెండోసారి ప్రదానిని చేశారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంటున్న మాటలు. ఎలాంటి నిర్ణయాలనే నిర్భయంగా తీసుకునే ప్రధాని మోదీ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. 

అంతే కాదు ఇప్పటి వరకు భారత దేశాంలో కాశ్మీర్ విషయంలో ప్రశ్నార్థకంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం కారణంగా చాలా మంది ఇతర పార్టీ సీనియర్ నేతలు బీజేపీలోకి వలస వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా బీజేపీలో చేరారు.

కపిల్ మిశ్రాతో పాటు ఆప్ మహిళా విభాగం అధ్యక్షురాలు రీచాపాండే ఢిల్లీలోని బీజేపీ  కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ  ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ పాల్గొని అందరికీ బీజేపీ కండువ కప్పారు.  ఢిల్లీలోని కార్వాల్‌నగర్‌ నుంచి ఆప్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన కపిల్‌ మిశ్రా పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఆయనపై పార్టీ ఫిరాయింపు చట్టం కింద దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయల్‌ ఇటీవల అనర్హత వేటు వేశారు. దీంతో తనపై అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ క్రమంలోనే 2017లో కపిల్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించారు.


ఈ సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ కపిల్ మిశ్రా, రిచా పాండేలను బీజేపీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలను, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, శ్యామ ప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్పవాల్ల ఆశయాల స్ఫూర్తిగా ఢిల్లీకి వీరిద్దరూ సేవ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: