చెవిటికల్లు సమీపం లో బోటు బోల్తా పడింది ప్రమాదం లో గౌతమి అనే పదకొండు ఏళ్ల బాలిక గల్లంతైంది, వరద ఉధృతి కి బోటు బోల్తా పడటంతో అక్కడి బాలిక పదకొండేళ్ల గౌతం కొట్టుకు పోయింది వరద ప్రవాహం లో ఈరోజు గౌతమి మృతదేహాన్ని కనుగొన్నారు రెస్క్యూ టీం. గౌతమి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు శోకసంద్రం లో మునిగిపోయారు 


నిన్న సాయంత్రం బోటు  తిరగ పడింది అప్పటి నుంచి కూడా మృతదేహం కోసం పోలీసు లు గాలిస్తూ  ఉన్నారు, ఇవాళ ఉదయం నుండీ ఎన్.డీ.ఆర్. ఎఫ్ బృందాలు ఎఫ్.డీ.ఆర్. ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలానికి  చేరుకున్నాయి  పడవలతో  ఆ చుట్టు పక్కల ప్రాంతం వద్ద కూడా గాలిస్తూనే ఉన్నారు. కొద్ది సేపటి క్రితం  ప్రమాదం జరిగిన చోటు కి కొద్ది దూరం లో ఉన్న   ఒక  శివాలయం   పక్కనే ఉన్న నీలల్లో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.


 నిన్న పాయంత్రం ప్రమాదకరం గా ఉన్న ఆ వాగులోంచి దాటే  ప్రయత్నం లో భాగం గా ఒక  నాటు పడవ ఇచ్చి తండ్రి  తన చెల్లి తో కలిసి గౌతమి  ఇటు పక్కకి తన అమ్మమ్మ వాళ్లింటి కి వెళ్లి ప్రయత్నం చేస్తోంది వీళ్ళీద్దరూ కూడా కవల పిల్లలు ఒకరు  లక్ష్మీప్రియ, గౌతమి ప్రియ, వీరిద్దరు కూడా కవల పిల్లలు. తండ్రి తో కలిసి వస్తున్న సమయం‌ లోనే పడవ తిరగబడింది. 


వీళ్ళు అటు నుండి ఇటు వస్తున్న సమయం‌లో ఒక గేదెల గుంపు ఒకటి ఈదుకుంటు వెళుతు బెదిరి వారివైపు దూసుకురావడం వల్ల ఒక గేదె కొమ్ము పదవకు తగిలి తిరగదడటం‌ జరిగింది.  పడవ ప్రమాదం జరిగిన వెంటనే  తండ్రి ఒక పాపను లక్ష్మీ ప్రియ ను  పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డు కు చేరుకోగలిగారు. ఈ లోపు గౌతమీ‌ మాత్రం నీటిలో కొత్తుకుని పోయింది. అప్పుడు పడవలో  మిగిలిన వారు ఎవరికి వారు తమ ప్రాణాలు కాపాడు కునే ప్రయత్నం లో ఉన్నారు. పాపని కాపాడటానికి వారికి కూడా అవకాశం‌ లేకుండా పోయింది. వరద ఉధృతి లో  పాప కొట్టుకుపోవడం జరిగింది, ఆ తర్వాత చుట్టు పక్కల గ్రామాల వారు పెద్ద ఎత్తున వచ్చి గాలించినా కూడా లభం లేకుండా పోయింది. కొద్ది సేపటి క్రితం పాప మృత దేహం లభించింది. కుటుంభ సభ్యులు అంతా శోకం లో మునిగిపోయి ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: