Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 4:38 pm IST

Menu &Sections

Search

'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?

'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎప్పుడూ గెలిచేవాడికంటే.. ఓడిపోయి గెలిచినవాడికే  ఆ గెలుపు లోటుపాట్లు పై  ఎక్కువ అవగాహన ఉంటుందంటుంటారు పెద్దలు. ఇక రాజకీయాల విషయానికి వస్తే  గెలుపు ఓటమి అనేవి  వచ్చేపోయే పగలు రాత్రి లాంటివి..  అని ఎంత సర్దిచెప్పుకున్నా తెలుగు తమ్ముళ్లకు బాధపొవట్లేదట.  నిజానికి బాబుగారికి ఓటమి కొత్త కాదు.. ఓడిపోయాకే ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు.  కానీ  2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం బాబుగారికి అలాగే  తెలుగుదేశం పార్టీకి అత్యంత అవమాన కరమైన ఓటమిని ఇచ్చారు ఏపీ ప్రజలు. నిజానికి ఇంత‌టి ఘోర  ప‌రాభావం టీడీపీకి ఇదే మొదటిసారి.  పైగా మళ్ళీ  తెదేపా  అధికారంలోకి రావాలంటే అసాధ్యమే అంటున్నారు. అందుకే తెలుగుదేశం  పార్టీ నాయ‌కులు, పార్టీని న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి అలుపెరుగ‌ని సేవ‌లు చేసిన కార్య‌క‌ర్త‌లు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అయినప్పటికీ  మళ్లీ బాబు సీఎం అవ్వటానికి ఇంకా  అవకాశాలు ఉన్నాయి. ఎడారిలో సైతం  అవసరం అయితే  నీళ్లను  సంపాధించేంత ఓపిక తెలివితేటలు బాబుకు ఉన్నాయి. ఇప్పటికైనా బాబు   ఓట‌మికి గల కార‌ణాల‌ను విశ్లేషించుకుని చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు పై  వ్యతిరేకత తగ్గుతుంది.  పైగా ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ సోషల్ మీడియాలో  పోస్ట్ చేసి సరిపుచ్చకుండా..  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా చొరవ తీసుకోవాలి. తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పి..  అవ‌స‌రం మేర‌కు వారి చేత పార్టీ సిద్దాంతాలను  అమ‌లు చేసే విధంగా ముందుకు సాగాలి. అలాగే  నాయ‌క‌త్వ లోపం లేకుండా..  ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి.  ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ ఇలా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు. 


అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా..  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయ‌గ‌ల‌గాలి. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి.  గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడా అంశాల‌ను నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో అధినేత స‌మీక్ష‌లు జరపాలి. ఇవన్నీ బాబు ప్రస్తుతం చేస్తున్నారుగా..   పచ్చ మీడియా కూడా రోజూ ఇవన్నీ రాస్తుందిగా..  అని తెలుగు తమ్ముళ్లు చెప్పొచ్చు గాక, కానీ  వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా  అంద‌రికీ  తమ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు, పార్టీలోని లోటుపాట్లు గురించి ఫిర్యాదు చేసిందుకు ఏ మాత్రం  అవ‌కాశం లేని స్థితి. ఈ విషయంలో బాబు అందరికి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.  ముఖ్యంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.  నిజానికి ఈ విషయంలో బాబు ముందునుంచీ చాల జాగ్రత్తగానే ఉన్నారు. అయినా నాయకులు పార్టీని వీడారు. ఇక బాబు చెయ్యాల్సిన మరో అంశం..   ప్రధానంగా యువ నాయ‌క‌త్వానికి పెద్ద పీఠ వేయాలి.  ఇలా సందర్భానుసారంగా  మేటి ప్ర‌ణాళిక‌లు వేస్తూ  ముందుకు వెళ్ళితే..  మళ్లీ  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా కాకుండా రోజూ బలం లేని ట్వీట్లు చేసుకుంటూ.. పార్టీ అఫీస్ లో నాలుగు మాటలు పలికి... ఈ సారి నేనే సీఎం అంటే.. అది సాధ్యం అయే పని కాదు. పైగా జగన్ తన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నాడు. అందుకే బాబు తన శైలి ప్రణాళికలు రచించాలి.          


'బాబు' శైలి ప్రణాళికలు ఎక్కడా ?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మలయాళ బ్యూటీ  టార్గెట్  తెలుగు ఇండస్ట్రీనే!
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.