గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రధానమంత్రినే 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అని సంభోదించి సభ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. ఈయన  గుంటూరు లోక్ సభ స్థానం నుంచి రెండో సారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే గుంటూరు లో పనిచేసే ఒక ఉన్నతాధికారి మాత్రం ఆ ఎంపీ కి కనీస విలువ గౌరవం ఇవ్వటం లేదు అని పార్టీ శ్రేణుల వాదన. దీని పై టిడిపి వర్గా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ అధికారి ఏమాత్రం పట్టించుకోకుండా తన ధోరణి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.


" అధికారం లో  ఉన్న పార్టీ   నేతలకు గులాం కొట్టే వారిని చూశాం కానీ మరీ   ఇంతగా వారి అడుగులకు మడుగులొత్తే వారిని చూడలేదు"  అని పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజులు గా తన పట్ల తమ పార్టీ ఎమ్మెల్యే పట్ల చూపుతున్న నిర్లక్ష్యం పై నిలదీసేందుకు రెండు రోజుల క్రితం ఆ అధికారి కార్యాలయానికి ఎంపీ జయదేవ్ వెళ్లారు.


 ఆ సమయంలో జయదేవ్ మరోసారి అవమానాన్ని చవిచూడాల్సివచ్చింది అని తెలిసింది. తల వంచుకొని ఏదో పని చేసుకుంటూ ఎంపీ తో కనీసం మాట్లాడేందుకు కూడా ఆ అధికారి ఇష్టత చూపలేదు అని టిడిపి వర్గాలు వాపోతున్నాయి. ప్రజాప్రతినిధి కి తగిన గౌరవం ఇవ్వకపోవడం తో ఇకనుంచైనా అతని పంథా మార్చుకోవాలని జయదేవ్ హెచ్చరించినట్లు తెలిసింది.


 ప్రభుత్వ పరంగా గుంటూరు లో జరుగుతున్న కార్యక్రమాలకు ఎంపీ గా ఉన్న తనను కానీ తమ పార్టీ కి చెందిన స్థానిక ఎమ్మెల్యే ను కానీ ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఇదంతా కూడా ఆ అధికారి కనుసన్నల్లో జరుగుతున్నాయని జయదేవ్ ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నగరాభివృద్ధి కి సంబంధించిన సమావేశాలకు కూడా తమను ఆహ్వా నించకుండా వివక్షత చూపుతున్నారని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: