పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 4,900 కోట్లకు రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ ఇచ్చింది. హెడ్ వర్క్స్ లో మిగిలి పోయిన పనులను 1800ల కోట్లు, హైడల్ ప్రాజెక్ట్ కు 3,100 కోట్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ నోటిఫికేషన్ ను జల వనరుల శాఖ వెబ్ సైట్ లో పెట్టింది. పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలనే ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ టెండరింగ్ మార్గదర్శక సూత్రాలు విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో జారీ చేసిన కొద్ది గంటలలోనే పోలవరం ప్రాజెక్ట్ అథార్టీ సీఈఓ ఆర్ కె జైన్ కొద్ది సేపటికే గత రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.


ఈ లేఖలో పోలవరం ప్రాజెక్ట్ కు రివర్స్ టెండరింగ్ వెళ్ళటానికి మంచిది కాదు అని చెప్పి ఆయన హితవు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చే వరకు కూడా వేచి చూడాలి అని చెప్పి కోరటంతో పాటు సోషియాల్ గా, ఎకనామికల్ గా కూడా ఇది చాలా తీవ్ర నష్టం కలిగిస్తుందని ప్రాజెక్ట్ ఆశించిన లక్ష్యానికి ఆ ప్రతిఫలాలు కనీసం కిందిస్థాయికి అందవని కూడా ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరగడంతో పాటు వ్యయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. పైగా ఇప్పుడున్న కాంట్రాక్టర్ ను తొలగించటానికి హేతుబద్ధమైన కారణాలేవి చూపించలేకపోతున్నారని ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం మంచిది కాదు అని చెప్పి నిన్న సాయంత్రం రివర్స్ టెండరింగ్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయటం,


ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మీద రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ మధ్యలో గత రాత్రి పోలవరం ప్రాజెక్టు అథార్టీ సీఈఓ ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కి ఒక లేఖ రాశారు. ఈ లేక ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వ జల వనరులశాఖ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కూడా తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ జల వనరుల శాఖ అధికారులు అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి పీపీఏ అథారిటీ సీఈవో ఆర్ కె జైన్ రాసిన లేఖ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.


అయితే న్యాయ నిపుణులతో సంప్రదించాలని చెప్పి జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వారిచ్చిన సూచనల మేరకు రివర్స్ టెండరింగ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొద్ది సేపటి క్రితం జలవనుల శాఖ టెండర్ నోటిఫికేషన్ ను వెబ్ సైట్ లో పెట్టింది. అయితే మొత్తం 4,900 కోట్ల రూపాయలకు పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ కు నోటిఫికేషన్ ను కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ జలవనుల శాఖ జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: