పేరులో మాత్రమే గ్రీన్‌ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ డెన్మార్క్‌లో ఓ స్వయంపాలిత ప్రాంతం.వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌ డెన్మార్క్‌లోని భాగమే.కానీ,ఇది స్వయం పాలిత ప్రాంతంగా ఉంది.ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈద్వీపంపై అగ్రరాజ్యం అధిపతి డోనాల్డ్‌ ట్రంప్‌ మనసుపడ్డారు.కెనడాకు ఈశాన్య ప్రాంతంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను కొనేస్తే బాగుంటుందని రక్షణ వ్యవహారాల పరంగా కలిసొస్తుందని కొందరు అధికారులు ట్రంప్‌కు సలహా ఇచ్చారట.కానీ వీరి ఆశలను అడియాసలు చేస్తూ గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వం స్పందించి వ్యాపారబంధమైతే తామూసిద్ధమేనని,కానీ అమ్మాలంటే మాత్రం కుదరదని సృష్టం చేసిందట.




గ్రీన్‌ల్యాండ్‌లోవిలువైన వనరులు,ఖనిజాలు,అత్యంతస్వచ్ఛమైననీరు,మంచు,చేపలు,సముద్రఆహారం,ఇంధనం వంటి అపార సంపద పై ట్రంప్ కన్నుపడటం వల్ల వచ్చిన ఈ ఆలోచన ఏప్రిల్ ఫూల్స్ డే జోక్ లా వుందని కానీ ఇది ఆ సీజన్ కాదని గ్రీన్‌ల్యాండ్ మాజీ ప్రధానమంత్రి లార్స్ లోక్ రాసుముసెన్ ట్వీట్ చేశారు.మరో ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వశాఖ మేం వ్యాపారం చేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా ప్రాంతాన్ని అమ్మటానికికాదని పేర్కొంది.ప్రధానమంత్రి కిమ్ కీల్సెన్ కూడా ఇదే మాట పునరుద్ఘాటించారు.వీరితో పాటు డెన్మార్క్ రాజకీయ నాయకులు కూడా అమెరికా అటువంటి ఆలోచన చేస్తుందనటాన్ని ఎద్దేవా చేశారు.'డెన్మార్క్ పౌరులను అమెరికాకు అమ్మటమనే ఆలోచన చాలా విడ్డూరమైనది అని ఒకవేళ ఆయన నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నట్లయితే ఆయనకు పిచ్చెక్కిందనడానికి ఇదే నిదర్శనమని డెన్మార్క్‌ మాజీ ప్రధాని రాస్మూసెన్‌ వ్యాఖ్యానించారు..



నిజానికి గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలన్న అమెరికా ఆలోచన ఇప్పటిది కాదట.1860ల్లో ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన ముందుకు వచ్చిందని,దానిని కొనుగోలు చేయటం చాలా ప్రయోజనకరమని అమెరికా విదేశాంగ శాఖ 1867లోనే ఒక నివేదికలో సూచించిందట.అయితే,ఈ విషయంలో 1946 వరకూ అమెరికా అధికారికంగా ఎటువంటి ప్రయత్నం చేయలేదు.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్,గ్రీన్‌ల్యాండ్‌ను 10కోట్లడాలర్లకు కొంటామని ప్రతిపాదించారట.



అంతేకాకుండా గ్రీన్‌ల్యాండ్‌లోని వ్యూహాత్మక భూభాగాలను అమెరికాకు ధారాదత్తం చేస్తే..దానికి బదులుగా అలాస్కాలోని భూమిని ఇచ్చే ఆలోచన కూడా ట్రూమన్ గ్రీన్‌ల్యాండ్‌ ప్రభుత్వం ముందు వుంచారట.ఇక అమెరికా గతచరిత్ర చూస్తే ఇతర దేశాలకు చెందిన భూభాగాలను సైనిక ఆక్రమణల ద్వారానే కాకుండా,ఆర్థిక ఒప్పందాల ద్వారా కూడా సొంతం చేసుకున్న ఉదంతాలు చరిత్రలో ఉన్నాయట..ఈ విషయం తెలిసిన వారు అమెరికాకు అధ్యక్షులు మారిన వారి బుద్దులన్ని ఏప్పటికి మారవని చురకలంటిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: