రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఒక గంజాయి ముఠా ను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను పోలిసులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం తో గంజాయి తో సహా విద్యార్ధుల్ని పట్టకున్నారు పోలీసులు.  విద్యార్థుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల గంజాయి ని వారు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు కాలేజీల వద్ద స్టూడెంట్స్ కు గంజాయి సప్లై చేస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. 


చదువుకోవాల్సిన విద్యార్థు లు తప్పుడు మార్గం లో నడుస్తూ గంజాయి కి అలవాటు పడి దానిని ఇతరులకు సప్లై చేస్తున్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు. వారు చెడిపోవడమే కాకుండా కాలేజీల వద్ద మాటు వేసి మరికొంత మంది ఇతర విద్యార్ధుల ని కూడా చెడగొడుతున్నారు. కాలేజీ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి సప్లై చేస్తున్నట్టు పోలీసులు సమాచరం సేకరించారు. ఈ మధ్య గంజాయి కేసులో ఎక్కువైపోతున్నాయి  ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర గంజాయి సప్లై ఎక్కువ అవుతున్నాయి, అందులోనూ విద్యార్ధులే సప్లయ్ చేస్తున్న కేసులు చాలా పెరుగుతున్నాయి.  


ఇవాళ పక్కా సమాచారం తోనే గంజాయి చేతులు మారుతున్నట్టూ తెలుసుకున్న  పోలీసులు పథకం ప్రకారమే పట్టుకున్నారు. వీరిలో చాలా మంది విద్యార్ధులు ఖమ్మం జిల్లా నుంచి  హైదరాబాద్ కి వచ్చి  ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో‌చదువుతున్నారు. గంజాయికి  సంబంధించి పూర్తి గా గత కొంత కాలంగా నిఘా వేసిన తరువాతనే పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి దగ్గర ఎనిమిది కిలోల గంజాయి దొరికింది. వీరు చాలా కాలంగా ఈ మత్తు పధార్ధాన్ని సప్లై  చేస్తున్నట్టు పోలిసుల దగ్గర సమాచారం‌ ఉంది.


 ప్రస్తుతం అరెస్టయిన నలుగురు విద్యార్థుల లో ఇద్దరు విద్యార్థుల పైన గతంలో బెంగళురూ లో కూడా ఈ కేసులు ఉన్నాయి.  వైజాగ్ అరకు నుంచి గంజాయి తీసుకొచ్చినట్టూ  పోలీసుల విచరణ లో‌ తేలింది.  మొత్తం నలుగురు విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నారు, మరొక కీలకమైన వ్యక్తి ప్రస్తుతం పరారీ లో ఉన్నత్తు సమాచారం. అగర శివార్ల లో  ఉన్న  చాలామంది విద్యార్ధులకు వీళ్ళు గంజాయి ని అమ్మినట్టు సమాచారం. ఇద్దరి పై ఇప్పటికే కేసులు ఉన్నందు వల్ల విచారణ ఇంకా లోతుగా చేస్తామని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: