విజయవాడను ఒక వైపు కృష్ణమ్మ పరవళ్లు మరోవైపు డ్రైనేజ్ నీరు ముంచేస్తుంది. దీంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. ఈ ఉదయం కురిసిన వర్షానికి మురికి కాలువల్లో పొంగిపొర్లుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ప్రధాన రహదారిలోనూ ఇదే పరిస్థితి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అక్కడ ఎక్కువగా స్కూల్స్ అదే విధంగా కాలేజీలు ఉండే ఏరియా అది. అయితే ఆరోడ్ లో మోకాల్లోతు డ్రైనేజీ నీరు నిలిచిపోయిన పరిస్థితి. ఒక వైపు విజయవాడనే వరదలు ముంచి గురిచేస్తుంటే, డ్రైనేజీ కూడా చాలా అక్కడి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. మోకాల్లోతు నీటిలో కాలేజీకొచ్చే విద్యార్థులందరూ కూడా ఆ రోడ్ లోనే రావాల్సిన పరిస్థితి. ఓవరాల్ విజయవాడలో చాలా చోట్ల ఆస్పత్రుల దగ్గర కూడా ఈ రకమైన పరిస్థితే ఉంది.



ఎక్కడికక్కడ డ్రైనేజీ నిలిచిపోయిన, నీరు నిలిచిపోయిన పరిస్థితి అయితే విజయవాడ వ్యాప్తంగా ఉంది. చిన్న చినుకు పడినా ఇలాగే ఉంటుంది. ఇది రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. కాని ఈ సారి మారుతుందేమో చూడాలి. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా మొత్తం నిండిపోయి ఇళ్ళలోకి, అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్ళి పోయాయి. ఇంకా బయటకి రావటానికి కూడా వీలులేనంతగా, రెండు,మూడు గంటలు వర్షం కురిస్తేనే ఇలాగ ఉంది. ఇంకా నిరంతరం కురిస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ కూడా కాలేజికి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.



దారి మధ్యలో కరెంటు పోల్స్ ఉన్నాయి. ఏదైనా జరగరానిది జరిగుతుంది,కాబట్టి పరిసర ప్రాంత కార్పొరేటర్ లేదా ఎవరైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు అధికారులు ఎవరూ రాలేదని స్థానిక ప్రజలు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా రోడ్లన్నీ కూడా ఈ రకంగానే ఉందంటూ కొంత మంది స్థానికులు చెబుతున్నారు. ఏదైతే కరెంట్ పోల్ ఉందో ఆ పోల్ గుండా చాలా మంది అక్కడ విద్యార్దులు వెళుతూ ఉన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ కొంత మంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: