వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే నిరుద్యోగులని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో సరికొత్త వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పథకం ప్రతిదీ ప్రజలకు చేరాలని ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ల ఉద్యోగాలని కొత్తగా క్రియేట్ చేశారు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాకపోయిన నిరుద్యోగులకి మంచి అవకాశం దొరికే వరకు ఒక ఆసరాగా ఉంటుందని దాదాపు 2 లక్షల 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.


నోటిఫికేషన్ ఇవ్వడమే ఆలస్యం శరవేగంగా ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టి ఇంటర్ అర్హత గల అభ్యర్ధులని వాలంటీర్ గా నియమించారు. ఒక్కో వాలంటీర్ గ్రామ/ వార్డు స్థాయిలో 50 ఇళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందించాల్సి ఉంటుంది. పెన్షన్,రేషన్ డోర్ డెలివరీ చేయడం… ఇతర పథకాలకు సంబంధించి యాభై ఇళ్ల అవసరాలు వీరి చూసుకోవాలి. జీతం రూ. 5వేలు. ఇక ఈ వాలంటీర్లు స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విధుల్లో చేరారు.


అయితే చేరిన రెండు రోజుల్లోనే దాదాపు 20 వేల మంది వాలంటీర్లు విధులకు డుమ్మా కొట్టారు. దాదాపు వీరు మళ్ళీ విధుల్లో పాల్గొనే అవకాశం కూడా లేదంటున్నారు. ఇంత స్థాయిలో వాలంటీర్లు రాకపోవడానికి కారణం తక్కువ జీతం ఇవ్వడమే అని అంటున్నారు. ఎక్కువ శ్రమ ఉంటుందని భావించి ముందుగానే డ్రాప్ అవుతున్నారు. కానీ భవిష్యత్ లో వీరి జీతం రూ. 10 వేల వరకు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.


మళ్ళీ రెండోసారి జగన్ సీఎం వాలంటీర్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు విధులు ఎక్కువ ఉన్నాయని భయపడి వాలంటీర్ల ఉద్యోగాలు వదిలేసుకుని భవిష్యత్ లో పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఉంది. అనవసరంగా బంగారం లాంటి అవకాశాన్ని చేజాతుల వదులుకున్నట్లు అవుతుంది. మ‌రి విధుల్లోకి రాని వ‌లంటీర్లు ఇప్ప‌ట‌కి అయినా స‌రైన నిర్ణ‌యం తీసుకుంటారేమో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: