ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి ఫైరింజన్ లను రప్పించారు అధికారులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పేషెంట్ లను ఎమర్జెన్సీ వార్డు నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎయిమ్స్ లోనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి చికిత్స జరుగుతున్న విషయం తెలిసింది. ఇప్పటి వరకు యాభై మంది పేషెంట్ లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి ఇరవై రెండు ఫైరింజన్ లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు వేగంగా రెండవ అంతస్తులకు వ్యాపించాయి.


టీచింగ్ బ్లాక్ వైపు కూడా మంటలు వ్యాపించాయి. ఢిల్లీ ఎయిమ్స్ లోని అది కూడా ఎమర్జెన్సీ వార్డులో ఈ మంటలు చెలరేగినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని ఫస్ట్ ఫ్లోర్ లో ఈ మంటలంటుకున్నట్టుగా తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఒక అంచనా కొస్తున్నారు. కానీ పూర్తి స్థాయి విచారణ జరిగితే కానీ ఈ ప్రమాదానికి గల కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. అలాగే పేషెంట్స్ ని సురక్షితంగా ఎమర్జెన్సీ వార్డు నుంచి షిఫ్ట్ చేసే పనిలో ఉన్నారు. అలాగే ఈ మంటలు సెకండ్ ఫ్లోర్ కి కూడా వ్యాపించినట్టు అక్కడ్నించి టీచింగ్ బ్లాక్ వైపు వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది.


పెద్ద ఎత్తున పేషెంట్స్ అలాగే స్ధానికులు ఎయిమ్స్ ముందు గుమ్ముగుడారు. ఖచ్చితంగా ఇక్కడ నిర్వహణాపరమైన లోపాలు ఉన్నాయన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఎయిమ్స్ అనేది భారత దేశం మొత్తం మీద కూడా అత్యున్నత వైద్య విద్యా సంస్థగా మనం చెప్తూ ఉంటాం. అక్కడ ట్రీట్మెంట్ పరంగానైనా విద్యాభోదన పరంగానైనా దేశంలోనే అత్యున్నత ర్యాంకులో  ఉంటుంది. అటువంటి విద్యా సంస్థల్లో, అటువంటి హాస్పటల్లో ఈ తరహా ప్రమాదం చోటుచేసుకోవడం, పైపెచ్చు ఇంత భారీ స్థాయిలో మంటలు ఒక అంతస్థు నుంచి పైనున్న మరొక రెండంతస్తులకు ఫస్ట్ ఫ్లోర్ లో మొదలైన మంటలు ఆ పొగ దట్టంగా అలుముకుని అది రెండు, మూడు అంతస్తుల వరకు కూడా వ్యాపించడం గమనార్హం


అంత జరుగుతున్నా కూడా దాన్ని అక్కడికక్కడే ప్రాథమిక స్థాయిలో ఆ మంటల్ని అదుపు చేయలేని పరిస్థితి ఎందుకుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సహజంగా ప్రతి హాస్పిటల్లో కూడా ఫైర్ సేఫ్టీ పరంగా హయ్యెస్ట్ స్టాండర్డ్ పాటించాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా మంటలు చెలరేగితే గనక వెనువెంటనే దాన్ని అక్కడికక్కడే ఆర్పేసే మెకానిజం ఉండాలి. ఎందుకంటే హాస్పిటల్ కు వచ్చేది లేవలేని స్థితిలో ఉండేవాళ్లు అనారోగ్యంతో బాధపడేవాళ్లు ఇటువంటి వాళ్ళంతా వచ్చి బెడ్స్ మీద ఉంటారు. అటువంటి వారు కనీసం తమ ప్రాణాల్ని తాము రక్షించుకోవడానికి లేచి పరుగులు కూడా తీయలేరు. అందుకే అక్కడ హయ్యెస్ట్ స్టాండర్డ్ మెయింటెన్ చేయాలి. కానీ ఇక్కడ అటువంటివేవీ లేవా ఉండి అవి సరిగా పనిచేయలేదా, నిర్వహణాపరమైన లోపాలున్నాయా అన్నదే ఇప్పుడు అందరి ముందు తలెత్తుతున్న ప్రశ్న దాని మీద అయితే ఇప్పుడు అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: