వైసీపి అధినేత మన ఆంధ్రా  ముఖ్యమంత్రి జగన్ ఏ పని చేసిన దానికి ఏదో ఒక అర్ధం అంతరార్ధం ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే . ఇటీవలే మన ముఖ్యమంత్రి చేసిన ఒక పని అందరిని అందరిని ఆలోచనలో పడేసిందట. మన ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మాత్రం ఒక లీడర్ కి  అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ఎవరాయన ఎందుకంత ప్రాధాన్యత అని పార్టీలో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ. ఆయన వైసీపీ నేత ఇక్బాల్. ఆయనకి ఎందుకంత ప్రాధాన్యత అని అనుకుంటున్నారా. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నమైన దూకుడుతో  దూసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్.


ఎన్నికల వేళ టిక్కెట్లిచ్చే అంశాల్లో కానీ క్యాబినెట్లో బర్త్ కన్ఫార్మ్ చేసిన కానీ ప్రతీదానికీ పక్కా గా లెక్కలుంటాయి. అలాంటిది వైసిపి నేత ఇక్బాల్ విషయంలో మాత్రం నాన్ స్టాప్ గా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఇక్బాల్ కి ఎందుకంత ప్రాధాన్యత అసలు జగన్ లెక్క ఏమిటన్న చర్చ పార్టీలో పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  ఒకప్పుడు ఇక్బాల్ ఐపీఎస్ అధికారి చంద్రబాబుకి సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు. ఐజీగా పదవీ విరమణ చేసిన తరవాత వైసిపి కి జైకొట్టారు. మొదట విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ ఇంచార్జిగా వ్యవహరించారు. దీంతో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారా అన్న చర్చ కూడా నాడు సాగింది.


అయితే సీన్ లోకి పీవీపీ వచ్చిన తరవాత ఇక్బాల్ ని పక్కన పెడతారా అని అంతా అనుకుంటున్న వేళ ఎవరూ ఊహించ ని విధంగా హిందూపూర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. బాలకృష్ణ ను ఢీకొట్టడానికి పంపించారు ఎన్నికలకు కాస్త ముందు హడావిడిగా హిందూపూర్ వెళ్లడంతో బాలకృష్ణను ఓడించే వ్యూహాలకు పదును పెట్టే సమయం దొరకలేదు. ఓటమి తరవాత హిందూపూర్ వైసీపీ ఇన్ చార్జి గా ఇక్బాల్ ని నియమించారు మన వైసీపీ అధినేత.  శాసన సభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థు లను ప్రకటించారు జగన్ అందులో ఒకరు నిజానికి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇచ్చిన ఇఫ్తార్ విందు లోను ఇక్బాల్ ని ఎమ్మెల్సీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.





మరింత సమాచారం తెలుసుకోండి: