ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అరుదైన విగ్రహం భారత్ చేతికి అందింది . క్రీస్తు శకం ఒకటో సంవత్సరానికి చెందిన ఈ విగ్రహాన్ని ఓ అంతర్జాతీయ దొంగల ముఠా కొన్నేళ్ల క్రితం దొంగిలించింది. చాలా కాలం నుంచి ఈ దొంగల ముఠా హవా కొనసాగుతూనే వచ్చింది . అయితే అమెరికా లోని న్యూయార్క్ పోలీసుల దగ్గర ఆ ముఠా ఆటలకు తెర పడింది . ఇటీవలే అమెరికా లోని న్యూయార్క్ పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా సభ్యులు అందరినీ అర్రెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు .


ఈ దొంగల ముఠా యొక్క నెట్ వర్క్ చాలా పెద్దగా దేశాల వ్యాప్తంగా వ్యాపించి ఉంది . వివిధ దేశాల నుంచి చాలా అరుదైన విగ్రహాలను దొంగలించి అధిక మొత్తాలకు విదేశాల్లో అమ్మేవారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకూ ఈ ముఠా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల ఆరు వందల విగ్రహాలను దొంగలించిందని వాటన్నింటిని ఆయా దేశాలకు అందజేయటానకి కృషి చేస్తున్నామని పోలీసు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విగ్రహంతో పాటు పదిహేడ వ శతాబ్దానికి చెందిన మరో విగ్రహాన్ని ఓ ఇంగ్లాండ్ వాసి కొనుగోలు చేశాడు.


అయితే ఈ విగ్రహాలు దొంగతనం చేసినవి అని తెలియడం వల్ల వీటిని తిరిగి ఇచ్చేయడానికి ముందుకు వచ్చాడు. అతనికి ధన్యవాదాలు తెలిపిన బ్రిటన్ , హోం లాండ్ సెక్యూరిటీ విభాగం గురువారం సాయంత్రం లండన్ లోని భారతీయ రాయబారికి ఈ విగ్రహాలను అందజేసింది. ఇటువంటి విగ్రహాలు ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనాలనే, ఇటువంటి సంపద ఆయా దేశాలకే చెందాలని అధికారులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: