టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ప్రజల్లో సింపతీని పొందడానికి తండ్రి కొడుకులు పడరాని పాట్లు పడుతున్నారు. జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ట్విట్టర్ లో ఒకరు మించి ఒకరు కామెడీని పండిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు మైలేజీ తీసుకురావటం కాదు కదా జనాల్లో కమెడియన్స్  గా మార్చెస్తున్నాయి. ప్రజా వేదిక విషయంలో సింపతీని పొందాలని చూశారు కానీ అక్కడ కూడా సెల్ఫ్ గోల్ అయ్యింది. అక్రమ కట్టడం కూల్చడం కరెక్టే కదా అని మెజారిటీ జనాలు ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు డ్రోన్ల మీద రాజకీయం చేయాలనీ చూశారు కానీ అది కూడా బెడిసి కొట్టింది. 


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు అనిపించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి, కనీసం మూడునెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రతి విషయంలో నానా యాగీ చేస్తున్నారు. నిజానికి టీడీపీ ఆపార్టీకి ఉన్న వీక్ నెస్ అది. అయిన దానికి కాని దానికి బోడి గుండెకు .. మోకాళ్ళకు ముడి పెట్టడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య.


చంద్రబాబు ఏమో ఒక పక్క నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా కల్పించడం లేదని కోర్ట్ కు వెళతారు. ప్రభుత్వం .. చంద్రబాబు ఇల్లుకు భద్రతా కల్పించే ఉద్దేశంతో డ్రోన్లను ఉపయోగిస్తే, దానిని కూడా రాజకీయం చేయడం ఒక్క చంద్రబాబుకే దక్కింది. అయితే లోకేష్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తమ ఇంటిని వరదల్లో ముంచడానికి ఏకంగా వరదలనే దారి మల్లించారని వీళ్ళు చెబుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. వీళ్ళ రాజకీయం ఏ స్థాయిలో ఉందో !

మరింత సమాచారం తెలుసుకోండి: