ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అందిస్తున్న రేష‌న్ కార్డుల్లో తెల్ల రేష‌న్ కార్డు ఒక‌టి. తెల్ల రేష‌న్ కార్డు వ‌ల్ల సబ్సిడీ ధరకే రేషన్ సరుకులు లభిస్తాయి. అయితే తాజాగా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు పొందుతున్న కొంద‌రి రేషన్ కార్డుల్ని రద్దు చేసింది. అయితే తెల్ల రేష‌న్ కార్డు వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మీరి వాటికి మీరు అర్హులో.. అన‌ర్హులో తెలుసుకోంది.


తెల్ల‌రేష‌న్ కార్డుకు అర్హులు/ అన‌ర్హులు:


- ప్ర‌భుత్వం నుంచి వేత‌నాలు పొందున్న ఉద్యోగులు మ‌రియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తెల్ల రేష‌న్ కార్డుకు అర్హులు కారు.


- ప్ర‌తి సంవ‌త్స‌రం ప్ర‌భుత్వానికి ఇన్‌క‌మ్ ట్యాక్స్ క‌ట్టేవారు మ‌రియు మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టేవారు తెల్ల రేష‌న్ కార్డుకు అర్హులు కారు.


- క‌రెంట్ బిల్లు రూ. 750/- పైగా వ‌చ్చిన వారు మ‌రియు పెన్ష‌న్ తీసుకునేవారు తెల్ల రేష‌న్ కార్డుకు అన‌ర్హులు.


- భూములు మ‌రియు పొలాలు 10 ఎక‌రాలు మించి ఉంటే వారు తెల్ల రేష‌న్ కార్డుకు అన‌ర్హులు.


- ఇంటిప‌న్ను క‌ట్టేవారికి మ‌రియు సొంతంగా ఫోర్ వీల‌ర్ ఉన్న‌వారు తెల్ల రేష‌న్ కార్డుకు అర్హులు కారు. టాక్సీలు మ‌రియు క్యాబ్స్ ఉప‌యోగించేవారు తెల్ల రేష‌న్ కార్డుకు అర్హులు.


- ముఖ్యంగా తెల్ల రేష‌న్ కార్డు ఉంచుకునేందుకు ఖ‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌జా సాధికార స‌ర్వే చేయించుకోవాలి.


రేష‌న్ కార్డు పంపిణీ వివ‌రాలు:


- ప్ర‌తి నెల 20వ తేదీన ప్ర‌తి రేష‌న్ డిపోల వారికి వారి రేష‌న్ కేటాయించ‌బడుతుంది.


- 21 మ‌రియు 22న‌ రేష‌న్ డీల‌ర్ల‌కు కేటాయించిన స‌రుకుని డిడి రూపంలో త‌గు మొత్తాన్ని గోడౌన్ ఇన్‌ఛార్జ్ వారికి అందిస్తారు.


- 23 నుంచి 30 వ‌ర‌కు గోడౌన్ నుంచి స‌ర‌కు డిడి రూపంలో త‌గు మొత్తాన్ని చ‌ల్లించిన రేష‌న్ డిపోల‌కు చేరుతుంది.


- 1 నుంచి 15 తేదీ వ‌ర‌కు రేష‌న్ దారుల‌కు వారి స‌రుకు పంపిణీ చేస్తారు.


స‌రుకుల వివ‌రాలు: బియ్యం మ‌నిషికి 5కీజీలు ఇవ్వ‌గా ఒక కేజీ రూపాయికి ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది. పంచ‌దార 1/2 కేజీ 20 రూపాయిల‌కు అందిస్తుంది. ప‌ప్పు దినుసు ఒక కేజీ 40 చొప్పున ఇస్తుంది. ఒక కేజీ ఉప్పు 12 రూపాయిల‌కు, 1కేజీ జొన్న ఒక రూపాయికి మ‌రియు రాగి 1కేజీకి ఒక రూపాయి చొప్పున ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: