ఇటీవలే కురిసినన భారీ వర్షాల కారణంగా అన్ని ప్రాజక్ట్ లు పూర్తిగా నిండిపోయాయి.వీటి కారణంగా జలాశయంలో అన్ని గేట్లను ఎత్తివేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అన్ని నీట మునగగా   నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం చాలా సంవత్సరాల తరువాత సరికొత్త అందాలను సంతరించుకుంది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద పోటెత్తడంతో ఆ వరద నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. సాగర్ లోకి వరద నీరు పోటెత్తడంతో సాగర్ మొత్తం ఇరవై ఆరు గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


ఆ దృశ్యం ఎంతో కన్నుల పండుగ్గా వుంది.ఈ అద్బుతాన్ని చూడడానికి  నాగార్జున సాగర్ వద్ద కొన్ని వేల మంది క్యూ కడుతున్నారు.ఇక సెలవు దినాల్లో అయితే నాగార్జున సాగర్ అంతా ట్రాఫిక్ జామ్ తో కిటకిటలాడుతోంది. ఈ అందాలను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ప్రయాణికులు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. చాలా అరుదుగా మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తివేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ  నిండు కుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ అందాలను జాలువారుతున్న ఆ నది అందాలను చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్న పర్యాటకులు ఫిదా అవుతున్నారు.


అంతకంతకు నాగార్జున సాగర్ వద్ద గంట గంటకూ వరద ప్రవాహం పెరుగుతూనే ఉంది. శ్రీశైలం వద్ద కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్ కు వదిలారు దీని కారణంగా మొత్తం ఇరవై ఆరు గేట్ల ను ఎత్తివేయగా మధ్యలో రోడ్ తరవాత ఈ అందాలను ప్రత్యక్షంగా  చూడ్డానికి వచ్చిన  చాలామందికీ పిల్లలకు స్కూల్ బుక్స్ లో ఉన్నట్టుగా నేరుగా చూసి ఆనంద పడుతున్నారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి అది ఎలా పని చేస్తుంది అని చాలా మంది పేరెంట్స్ దగ్గరుండి చూపించాలన్న ఉద్దేశంతో నాగార్జున సాగర్ కు తీసుకువెళ్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోందని చెప్పుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: