ఏపీలో చంద్రబాబు ఇంటి చుట్టూ రాజకీయం శెరవేగంగా తిరుగుతుంది. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు చెబుతూ చంద్రబాబు కు ఇల్లు కావాలంటే దరఖాస్తు చేసుకుంటే ఇస్తామని జగన్ ఆ విషయాన్ని తక్షణమే పరిశీలిస్తారని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ఇప్పటీకే చంద్రబాబుకు ఇల్లు కావాలంటే ఇస్తామని ఆళ్ల రామకృష్ణ రెడ్డి చెప్పిన సంగతీ తెలిసిందే. సిగ్గులేకుండా ఇంకా అక్రమ కట్టడంలో ఉంటూ టీడీపీ నేతలు దిగజారి పోతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు కూడా ఇల్లు కోసం ధరఖాస్తు చేసుకుంటే .. ప్రజలతో పాటు ఆయనకు కూడా వచ్చే ఉగాది లోపల ఇల్లు పట్టాను ఇస్తామని వ్యగ్యంగా సమాధానం చెప్పిన సంగతీ తెలిసిందే . 


అయితే అంబటి రాంబాబు మాట్లాడతూ .. ఈ డ్రోన్లను గత మూడు రోజులు నుంచి ప్రభుత్వమే పెట్టిందని .. వరద ముప్పును అంచనా వేయడానికే మాత్రమే ఉపయోగిస్తున్నామని .. కానీ టీడీపీ అనవసర డ్రామాలు ఆడుతుందని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఎగువ ప్రాంతంలో భారీ గా వర్షాలు కురవడంతో ప్రకాశం బ్యారేజి కు మరింత వరద నీరు వచ్చే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రతగా డ్రోన్లతో అంచనా వేస్తున్నామని చెప్పారు. 


సాధారణ ప్రజలను ఎలాగైతే కాపాడాలో.. రాష్ట్ర ప్రతి పక్ష నేత అయిన చంద్రబాబును అలాగే కాపాడాల్సిన భాద్యత ప్రభుత్వానిది. కానీ దానిని కూడా తప్పు అనే స్థాయికి దిగజారి టీడీపీ నాయకులూ మాట్లాడుతున్నారని చెప్పారు. గత ఐదేళ్లుగా ముఖ్య మంత్రిగా పని చేసిన చంద్రబాబు అమరావతిలో సెంటు భూమి కూడా కొనలేకపోయారని ఎద్దేవా చేశారు. అమరావతిలో ఉండటం బాబు గారికి ఇష్టం లేదని అందుకే ఇల్లు కట్టుకోలేదని అంబటి ఫైర్ అయ్యారు. అక్రమ కట్టడంలో ఉంటూ .. చంద్రబాబు ఇలా మాట్లాడటం కరెక్టు కాదని .. అందుకే బాబు ఓటమి పాలయ్యారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: