జనసేనకు మహిళా నాయకురాలు షాక్ ఇచ్చింది. జనసేనకు పుట్టి లక్ష్మీసామ్రాజ్యం గుడ్ బై చెప్పింది. పార్టీని వీడుతూ జనసేనపై తీవ్ర ఆరోపణలు చేసింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సామ్రాజ్యం గుంటూరు జిల్లా పెదకూరపాడు జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయింది. ఈమెకు 7,200 ఓట్లు వచ్చాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆమె కొద్ది రోజులుగా పార్టీలో సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చారు.


అయితే ప్రస్తుతం జనసేనలో పరిణామాలు నచ్చక ఆమె పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరింది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 100 మంది కార్యకర్తలతో కలిసి కాషాయ జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె జనసేనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో సొంత పార్టీ నేతలే తనపై లేనిపోని దుష్ప్రచారాలు చేసి, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారన్నారు.


అసలు కష్టపడి పనిచేసేవారికి జనసేనలో విలువలేదని, అంజిబాబు లాంటి వ్యక్తి పవన్‌కల్యాణ్‌ వద్ద ఉండగా జనసేన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని తేల్చి చెప్పేశారు. ఇక  వైసీపీకి ఓట్లు వేసిన వారిని పవన్‌కల్యాణ్‌ వద్దకు తీసుకెళ్లి జనసేన పార్టీకి ఓట్లు వేశారని చెబుతున్నారని తెలిపారు. ఈ విషయాలు తనను ఎంతో బాధపెట్టాయని, అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ సిద్ధాంతాలు, బీజేపీ ఆశయాలు నచ్చి ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆమె తెలిపారు.


కాగా, సామ్రాజ్యం లాగానే చాలామంది నేతలు జనసేనపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీపై అసంతృప్తితో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలని ఆయన ఖండించిన పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.  ఏదేమైనా సామ్రాజ్యం బాట‌లోనే మ‌రి కొంద‌రు నేత‌లు కూడా ఇత‌ర పార్టీల బాట ప‌ట్ట‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: