సుజనాచౌదరి ఈ పేరు గత కొన్నేళ్ళుగా మాత్రమే కొన్ని వర్గాలకు మాత్రమే పరిచయం. ఎందుకంటే ఆయన ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి కాడు. టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం వల్లనే బాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ తెరచాటున చక్రం తిప్పేవారు. అలా ఆయన చేసిన సేవలు మెచ్చి చంద్రబాబు రాజ్యసభ సీటు రెండు మార్లు కట్టబెట్టారు. మరి బాబు రుణం సుజన తీర్చుకున్నారా అంటే మోడీ క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఉంటూ చాలా  తీర్చుకున్నారు. మిగిలింది ఇపుడు బీజేపీలోకి ఫిరాయించి తమ మాజీ అధినేత మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారు.


సుజనాచౌదరి విశాఖ టూర్లో చేసిన కొన్ని కామెంట్స్ పరిశీలిస్తే ఆయన ఇంకా టీడీపీలో ఉన్నారా అన్న డౌట్లు వస్తాయి. సుజనా జగన్ని దారుణంగా విమర్శించారు. ఏపీలో పాలన లేనేలేదని అన్నారు. జగన్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారని కూడా పెద్ద మాట వాడారు. అదే సమయంలో పాలన అంటే చంద్రబాబుని టార్గెట్ చేయడం కాదు జగన్ అంటూ సుద్దులు చెప్పారు. కాంట్రాక్టులు రద్దు చేయడం, రివర్స్ టెండరింగ్ ఇదేంటి పాలన  అంటూ ఎకసెక్కం ఆడారు. జగన్ చంద్రబాబుపై కక్షకట్టి పాలన చేస్తున్నారని అన్నారు.


ఈ మాటలు విన్నపుడు సుజనా పసుపు తమ్ముడుగా మాట్లాడారని అనిపిస్తుంది. నిజమే ఆయనకు చంద్రబాబు రాజకీయ గురువు. ఆ మాట కూడా ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అటువంటి సుజనా బాబుకు లాభం చేకూర్చే పని చేస్తారు తప్ప విమర్శలు ఎందుకు చేస్తారు. సుజనా ద్రుష్టిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాబుకు వ్యతిరేకమన్నమాట. మొన్న ఏపీకి వచ్చినపుడు పోలవరం టెండర్ల రద్దు పై మండిపడింది కూడా ఇదే సుజనా చౌదరి. మెల్లగా ముసుగు తొలగించుకుని చంద్రబాబు భక్తిని చాటుకున్న సుజన తీరు బీజేపీలో నేతలు ఎలా జీర్ణించుకుంటున్నారో అర్ధ కావడంలేదని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.


చంద్రబాబుపై పీకల్లోతు కోపంతో ఉన్న జాతీయ నాయకత్వం ఓ వైపు ఉంటే ఏపీలో టీడీపీ నుంచి ఫిరాయించిన సుజనా చౌదరి చేస్తున్న కామెంట్స్ అగ్ర నాయకత్వానికే షాక్ ఇచ్చేలా ఉన్నాయని బాబు పొడగిట్టని ఏపీ బీజేపీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు అక్రమాలపైన  ఏపీకి వచ్చి రచ్చ చేసే జీవీఎల్ నరసింహరావు వంటి వారి విధానం ఓవైపు ఉంది. మరి అదే పార్టీకి చెందిన సుజనా చౌదరి మరో రకంగా మాట్లాడుతున్నారు. పోలవరం బాబుకు ఏటీఎం అన్న ప్రధాని మోడీ ఓ వైపు ఉంటే చంద్రబాబుకు వత్తాసు పలికే సుజనా మరో వైపు ఉన్నారు. ఇంతకీ సుజనా బీజీపీని ఏపీలో  పటిష్టం చేయడానికి వెళ్లారా. లేక టీడీపీని బలపరచడానికి అటునుంచి ఇటు వైపు నరుక్కువస్తున్నారా అన్నది బీజేపీ పెద్దలకు అర్ధం కాకపోవచ్చు కానీ ఏపీలో ప్రతి ఒక్కరికీ తెలుస్తోందని సాధారణ కమలం పార్టీ కార్యకర్తలు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: