ఏపీలో ఇప్పుడు ఎక్కడ చుసిన డ్రోన్ల రాజకీయ వార్తలే కనిపిస్తున్నాయి. అధికార, ప్రతి పక్ష పార్టీలు ఒకరు మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇక ఈ డ్రోన్ల రాజకీయం అపి లోతట్టు ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరువాత చూసుకోండి .. ఇప్పుడు కాదని జనసేన ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. చంద్రబాబు ఇల్లు వరదల్లో మునిగిందా లేదా అని విమర్శలు. ప్రతి విమర్శలు చేసుకోవటం అనవసరమని పవన్ ఫైర్ అయ్యారు. కృష్ణా నది వరద కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏపీ మంత్రులు కరకట్ట దగ్గర ఉన్నారని ఎద్దేవా చేశారు. 


151 స్థానాలు గెలిచిన పార్టీ ఇలా వ్యవహరించడం మంచిది కాదు. ప్రజలకు సుపరిపాలను అందించాలని , విమర్శలకు తావు ఇవ్వకూడదని పవన్ చెప్పుకొచ్చారు. అయితే అయితే కృష్ణ నదికి అనుకున్న చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమని మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. నది పరివాహక ప్రాంతం అయినా లింగమనేని గెస్ట్ హౌస్ చట్ట విరుద్ధమని, సాక్షాత్తు కేంద్ర పర్యావరణ శాఖ కూడా లేఖలో పొందు పరిచింది.


అందుకే చంద్రబాబు నివాసానికి అనుకుని ఉన్న ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చి పడేశారు. అయితే ఇప్పుడు వర్షాలతో, వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతుంది. దీనితో చంద్రబాబు నివాసానికి ముంపు వచ్చింది. చంద్రబాబు కూడా అక్కడ ఉండలేక హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి. వరదను ఆపడానికి ఇసుక బస్తాలను మోహరించిన పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రజలకు వరదల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని .. గంట గంటకు నీటి మట్టాన్ని అంచనా వేసి వరద నీటిని వదలటం జరుగుతుందని వైసీపీ చెబుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: