రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎప్పుడూ విమర్శ ప్రతి విమర్శలు, వాదనలూ జరుగుతూనే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీపై దాడి చేయకపోతే ప్రతిపక్ష పార్టీకి మనుగడ ఉండదు. కానీ.. వీటికి భిన్నంగా జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హైలైట్ అయింది. నిత్యం బీజేపీ ప్రభుత్వ విధానాలను తూలనాడే కాంగ్రెస్ అగ్రనేత చిదంబరం సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ నిర్ణయాలను స్వాగతించడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాజకీయ వర్గాల్లో కొంత ఆశ్చర్యం కలిగించినా చిదంబరం వాఖ్యలను మాత్రం ఎవరూ తప్పుబట్టలేరు.. కాంగ్రెస్ అధిష్టానంతో సహా.



ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన మూడు అంశాలను  చిదంబరం ట్వీట్ చేశారు. "జనాభా నియంత్రణ, సంపద సృష్టించేవారి పట్ల గౌరవ భావంతో ఉండటం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయడం.." ఈ మూడు అంశాలపై ప్రధాని ప్రసంగం బాగుందని మెచ్చుకున్నారు. ఈ అంశంపై ఆయన చేసిన ట్వీట్ ఆకట్టుకుంది. ఈ మూడు అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఓ  సీనియర్ నాయకుడు అధికార పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాలను మెచ్చుకోవడం ఆశ్చర్యమే. ముందుగా.. ఇలాంటి సహృద్భావ వాతావరణాన్ని అందరూ స్వాగతించాలి. ప్రధాని ప్రస్తావించిన ఈ మూడు అంశాలు భవిష్యత్ భారతానికి ఎంతో అవసరం.



నిజానికి ఈ మూడు అంశాలూ ఎంతో కీలకమైనవి. దేశ భవిష్యత్తుకు ఇవి ఎంతో కీలకం. కొన్ని అంశాల్లో వీటిని విమర్శించడానికి కూడా ఎవరూ సాహసించలేరు.  ప్రత్యర్థులకు బాణాల్లాంటి విసుర్లు వేయడంలో ప్రధాని సిద్ధహస్థులు. ఈ విషయంలో చిదంబరం తక్కువేమీ కాదు. కానీ.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ మూడు అంశాలపై ప్రధాని వ్యాఖ్యల్ని చిదంబరం మెచ్చుకోవడం రాజకీయంగా మంచి పరిణామం.


మరింత సమాచారం తెలుసుకోండి: