తెలుగుదేశం పార్టీ అధికారంలోకి దిగిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. అందులో అది కూడా అతి ముఖ్య కారణం. ఉమ్మడి ఏపీకి హైటెక్ సీఎం చంద్రబాబు హవా చేసే రోజుల్లో తెలిసి తెలిసి చాలా తప్పులు చేశారు. ఇక విభజన ఏపీలో కూడా మారిన మనిషిని అని చెప్పుకున్నా బాబు  మారలేదు. ఆ సంగతి అందరితో పాటుగా మరో వ్యక్తి కూడా గుర్తించారు. అందుకే ఆయన బాగా అలిగారు.


ఆ వ్యక్తి ఎవరో కాదు వరుణుడు. అవును బాబు ఉమ్మడి ఏపీ సీఎం గా తొమ్మిదేళ్ల పాలన పూర్తిగా కరవు కాటకాలతో నిండిఉంది. ఇక ఇపుడు అయిదేళ్ళ నవ్యాంద్ర్హ పాలన సైతం అదే తీరున సాగింది. వాన చుక్క అన్నదే లేకుండా బాబు మూడవసారి సీఎం పదవీకాలం ముగిసింది. ఆయన్ని ఓడించి మరీ జగన్ అధికారంలోకి వచ్చాడు.


జగన్ ఇలా రాగానే అలా వానలు కురుస్తాయని అంతా అనుకున్నారు. కానీ వానలు లేవు. దాంతో  తమ్ముళ్ళు సెటైర్లు వేయడం ప్రారంభించారు. ఇదిలా ఉండగానే ఆగస్ట్ లో వరుణుడు కరుణించాడు. ఎగువ రాష్ట్రాలో భారీగా వానలు కురిసాయి.దాంతో దిగువకు నీరు ప్రవహించింది. అలా ఇలా కాదు. కట్టలు తెంచుకుని మరీ ప్రవహించింది. ఓ వైపు గోదావరి, మరో వైపు క్రిష్ణ ఇలా వరదలు పోటెత్తి మొత్తానికి మొత్తం జలాశయాలు నిండిపోయాయి.


అదేదో మాయాబజార్ సినిమాలో చూపించినట్లుగా మ్యాజిక్ చేసినట్లుగా జలాశయాల్లో నీరు పుష్కలంగా వచ్చి చేరింది. ఈ ముచ్చట చూసి కచ్చితంగా పదేళ్ళు పై దాటింది. రైతాంగం, ప్రజలు  ఈ పరిణామాల పట్ల హాపీగా ఉంటే టీడీపీకి మాత్రం కడుపులో మంటగా ఉన్నట్లుంది. వానలు లేవు అని ఇంకా తమ్ముళ్ళు అంటున్నారంటే అది పూర్తిగా ఆక్రోశమే తప్ప మరేమీ కదన్నది నిజం.


చంద్రబాబు ఏవీ వానలు అని ఇంకా వెటకారం చేస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని వానలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయని లోకేష్ ట్విట్టర్ లో కూత పెట్టారు. ఎన్ని వానఅలు కురిస్తే జలాశయాలు నిండుతాయి. ఒక్క దెబ్బకు అన్నట్లుగా అన్నీ నిండుకుండల్లా ఉంటే చూసి ఓర్వలేకనే టీడీపీ తమ్ముళ్ళు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు.


ఏపీలో జలాశయాలు నిండిన తీరు చూసి చంద్రబాబు, లోకేష్ లకు మైండ్ బ్లాంక్ అయిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఏపీలో జలకళను చూసి ఇద్దరూ తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. తాము వరద పరిస్థితిని  సమీక్ష చేస్తూ బాధితులను ఆదుకుంటూంటే వూరకే కూర్చుని తమపై టీడీపీ నేతలు రాళ్ళు వేస్తున్నారని ఆయన విమర్శించారు. మొత్తానికి తండ్రీ కొడుకులు కుళ్ళుకుంటున్నారని అనిల్ కుమార్ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: