ఎన్నో ఆశలతో చేసిన రణరంగం సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో హీరో శర్వానంద్ ఆ సినిమాను నిలబెట్టేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.. కానీ ఆ ఇంటర్వ్యూల్లోనూ శర్వానంద్ లో విశ్వాసం కనిపించడం లేదు. అంతే కాక.. పాపం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటున్నట్టుగా ఉంటున్నాయా ఇంటర్వ్యూలు.


తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో … నేను ముందు నుంచీ కథాబలం ఉన్న చిత్రాలే చేశానని.. అందుకే నా సినిమా అనేసరికి కథలో కొత్తదనం ఉంటుందని అంతా అనుకుంటారని... ఈసారి మాత్రం కథ గురించి ఆలోచించకుండా కేవలం కథనం నమ్మి చేశానని.. చెబుతున్నాడు. అంటే ఈ సినిమాలో కథ లేదు అంటూ తప్పు అంగీకరించేస్తున్నాడు.


అంతే కాదు.. ఈ సినిమా ద్వారా ఆశించిన ఫలితమైతే రాలేదని కూడా చెప్పేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే..

" సమీక్షలు యావరేజ్‌ సినిమా అని చెప్పాయి. వసూళ్లు మాత్రం బాగున్నాయి. నా సినిమా అనేసరికి ముందు ఏ క్లాస్‌ సెంటర్లు హౌస్‌ఫుల్‌ అవుతుంటాయి. కానీ ‘రణరంగం’ మాత్రం ముందు బీ, సీ సెంటర్లు ఫుల్స్‌ అవుతున్నాయి. తొలి ఆటకు సినిమా బాలేదు అన్నారు. ఆ తరవాత యావరేజ్‌ అన్నారు. ఇప్పుడు మంచి సినిమా అని చెబుతున్నారు.


ఇప్పటి వరకూ నేను మాస్‌ పాత్రలు చేయలేదు. ఒక్కసారిగా ఫైట్లు చేసి, మాస్‌గా కనిపిస్తే జనాలు ఎలా స్వీకరిస్తారో అని భయం. అందుకే ‘రణరంగం’తో కొద్దిగా మాస్‌ రుచి చూపించాను. ఈ సినిమాలో కథ లేదని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నా. కథనం నచ్చి ఈ సినిమా ఒప్పుకున్నా. యాక్షన్‌ నేపథ్యమైనా, హింసాత్మక సన్నివేశాలు ఎక్కువ లేకుండా జాగ్రత్త పడ్డాం. అందుకే కుటుంబ ప్రేక్షకులూ చూడగలుగుతున్నారు... అంటూ కలరింగ్ ఇస్తున్నాడు శర్వా..పాపం.. మరి కలెక్షన్లు పెరుగుతాయా.. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: