అవును ఒక్క రూపాయికే బీమా అందిస్తోంది ఆంధ్ర ప్రదేశ్ సర్కారు.. అయితే ఇది వ్యక్తుల కోసం కాదు.. పంటల కోసం.. రైతుల కోసం జగన్ సర్కారు కల్పిస్తున్న మరో సువర్ణ అవకాశం ఇది. గతంలో ఎకరానికి 520 రూపాయలు ఉన్న ప్రీమియం ఇప్పుడు జగన్ సర్కారు పూర్తిగా తగ్గించేసింది. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక్క రూపాయి కడితే చాలు పంటలకు బీమా కల్పిస్తోంది. ఈ పంటల బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్ట్ 21 ఆఖరు తేదీగా ఉంది.


ఈ విషయాన్ని రైతులందరికీ తెలిసేలా షేర్ చేసి తెలియని రైతులకు తెలియచేయండి. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతులు నామ మాత్రపు రుసుము రూపాయి చెల్లించి నమోదు చేయించుకుంటే చాలు.. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఉచితంగా చెల్లిస్తుంది. దీని కోసం సొంతంగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించింది. ఈ పథకాన్ని ఖరీఫ్ నుంచే అమలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.


పంట రుణాలు తీసుకోని రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా నామమాత్రంగా ఒక రూపాయి చెల్లించి నమోదు చేసుకుంటే చాలు . బ్యాంకుల్లో పంట రుణాలున్న వారితో పాటు రుణాలు పొందని రైతులు కూడా నామమాత్ర రుసుము చెల్లించి నమోదు చేసుకొనే అవకాశం ఉంది. బీమా ప్రీమియం చెల్లించే వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తోంది.


ఇందుకోసం రైతు చేయాల్సిందేమిటంటే... రూపాయి చెల్లించి.. పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, భూమి వివరాలు నమోదు చేయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా బీమా సంస్థను ఏర్పాటు చేసింది. పరిహారం విడుదలపై నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటిదాక పంటల బీమా నామమాత్రంగానే ఉంది. పంటల వారీగా బీమా సంస్థలు నిర్ణయించిన ప్రీమియంలో రైతు వాటా 2 నుంచి 5 శాతం వరకు ఉంటోంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భరిస్తున్నాయి. ఇప్పుడు జగన్ సర్కారు ప్రీమియం మొత్తం భరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: