పశ్చిమ బెంగాల్ లోని బర్సాత్ అనే ప్రాంతంలో గార్గీ బంద్యోపాధ్యాయ్ అనే మహిళ తన తల్లీదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఈమె తల్లీదండ్రులిద్దరికీ వయస్సు 80 సంవత్సరాలు దాటింది. ఒకప్పుడు వీరి కుటుంబం బాగా బ్రతికిన కుటుంబమే. కానీ ప్రస్తుతం ఈ కుటుంబం చాలా ధీన స్థితిలో ఉంది. గార్గీ బంద్యోపాధ్యాయ్ కు పెళ్ళైనప్పటికీ కొన్ని కారణాల వలన ఈమె తన భర్త నుండి విడిపోయింది. భర్త నుండి విడిపోయాక గార్గీ తన తల్లీదండ్రులతో కలిసి జీవిస్తోంది. 
 
పీ హెచ్ డీ దాకా చదిన గార్గీ బంద్యోపాధ్యాయ్ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ గార్గీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరకలేదు.ఉద్యోగం లేకపోవటంతో కుటుంబం అంతా ఆకలితో బాధపడాల్సి వచ్చింది. 80 సంవత్సరాల వయస్సు దాటిన తల్లీదండ్రులిద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మందులు కూడా కొనలేని తన పరిస్థితిని తలచుకుని ఈమె ఎంతో బాధపడింది. ఇలాంటి సమయంలో తన తండ్రి ఒక చిన్నపిల్లాడి దగ్గర 10 రుపాయల కోసం యాచించాడు. 
 
ఆకలి, నిరుద్యోగం వలన గార్గీ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. తన తండ్రి పది రుపాయల కోసం యాచించటం చూసిన కూతురు ఎంతో బాధపడింది. ఈ సమస్యలకు చనిపోవటం తప్ప ఇంకో మార్గం లేదని తన కుటుంబానికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అధికారులకు లేఖ రాసింది గార్గీ. చనిపోవటానికి అనుమతి ఇవ్వమని కలెక్టర్ కు ధరఖాస్తు పెట్టింది గార్గీ. 
 
ధరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ ఆ ధరఖాస్తును బర్సాత్ మున్సిపల్ ప్రాంతానికి చెందిన చైర్మన్ కు పంపించాడు. ధరఖాస్తును పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సునీల్ ముఖర్జీ గార్గీకి ఎలాంటి సహాయం అందించటం కుదరదని, ఆమె తల్లిదండ్రులకు మాత్రం ఆర్థిక సహాయం అందించే అవకాశం గురించి పరిశీలిస్తున్నామని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: