ఏపీ సీఎం జ‌గ‌న్‌..  ఎక్క‌డ ఉన్నా.. ఎక్క‌డికి వెళ్లినా.. చెబుతున్న ఏకైక మాట‌.. అవినీతి లేని అభివృద్ది. ఏపీలో అవినీతి లేని ప్ర‌భుత్వాన్ని, అభివృద్ధి ప‌రుగుల స‌ర్కారును మీరు చూడ‌బోతున్నారు! అంటూ ఆయ‌న చేస్తు న్న ప్ర‌సంగాలు యువ‌త‌లోను, పారిశ్రామిక వేత్త‌ల్లోనూ ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఏపీకి పెట్టుబ‌డు ల‌ను ఆకర్షించేందుకు జ‌గ‌న్‌.. తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా ఇక్క డ ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం సాధించ‌లేక పోయింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.,. అమెరికా పెట్టుబ‌డి దారులు అవినీతిని, లంచాల‌ను స‌హించ‌క పోవ‌డ‌మే! 


లంచాలు, అవినీతి, అనుమ‌తుల పేరుతో సుదీర్ఘ స‌మ‌యం కాల హ‌ర‌ణం.. వంటివాటికి చెక్ పెడితే.. భారీ ఎత్తున అమెరికా నుంచి పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని గుర్తించిన జ‌గ‌న్‌.. ఆదిశ‌గా త‌న ప్ర‌యాణాన్ని సాగించా రు. ‘పారిశ్రామిక అభివృద్ధికి రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రండి. మీకు అండగా మేముంటాం’ అని ప్రవాస భారతీయులకు జ‌గ‌న్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబ డులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. 


అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌ డల్లాస్‌లోని కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు. పెట్టుబడిదా రులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. అందరూ తమ తమ గ్రామాల అభివృద్ధికోసం సహకరించాలని కోరారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం అందరిది అని, ఎప్పుడొచ్చినా అందరికి తాను తోడుగా ఉంటానని చెప్పారు. 


ఇదిలావుంటే, జ‌గ‌న్ నాయ‌క‌త్వానికి పెద్ద‌న్న దేశం అమెరికాలోనూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. భారత రాయబారి హర్షవర్దన్‌ జగన్‌ నాయకత్వాన్ని హర్షవర్దన్‌ ప్రశంసించారు. జగన్‌ సంకల్పం, స్థిర త్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గం వైపు నడిపిస్తాయని హర్షవర్దన్‌ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి గ‌తంలోనూ అమెరికా నుంచి పెట్టుబ‌డులు తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగినా.. జ‌గ‌న్ రేంజ్ మాత్రం డిఫ‌రెంట్‌గా ఉంది గురూ! అంటున్నారు అన‌లిస్టులు. మొత్తానికి జ‌గ‌న్ అసాధ్యుడ‌నే పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: