ఆర్టికల్ 370 రద్దు, అజిమ్ము కాశ్మీర్, లడక్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించిన తరువాత దేశంలో పెను మార్పులు సంభవించాయి.  ఆగష్టు 5 వ తేదీన దేశంలోని అనేక ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు.  కేవలం బీజేపీ మాత్రమే కాదు.. చాలా పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి.  జమ్మూ కాశ్మీర్ పూర్తిగా ఇండియాలో అంతర్భాగం కావాలని కోరుకున్నారు.  వారికలను కేంద్రం ఇలా నెరవేర్చింది.  ఇప్పుడు భారతీయులకు మరొక కల ఉన్నది.  పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ ను కూడా ఇండియా తిరిగి తీసుకోవాలని అంటోంది.  అప్పుడే ఇండియాకు పూర్తిగా న్యాయం చేసినట్టు అవుతుందని కొంతమంది వాదిస్తున్నారు.  


ఇదిలా ఉంటె, ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత కాశ్మీర్ లో ఉండే కాశ్మీరీ ప్రజల రియాక్షన్ ఎలా ఉన్నా.. కాశ్మీర్లో ఉన్న 21వేల కుటుంబాలు మాత్రం చాలా  హ్యాపీగా ఫీలవుతున్నారు.  1947 వ సంవత్సరంలో ఇండియా.. పాకిస్తాన్ విడిపోయిన తరువాత పాకిస్తాన్ కు చెందిన 27 వేల కుటుంబాలు కాశ్మీర్ కు వలస వచ్చాయి.  వీరంతా కాశ్మీర్లోనే ఉంటున్నారు.  వీరి పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉన్నది.  72 సంవత్సరాలుగా వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పధకాలు అందలేదని అంటున్నారు.  


తమ పిల్లలకు ఉద్యోగాలు లేవని, కనీసం చదువుకూడా చెప్పించలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  శరణార్ధులకు ఇవ్వాల్సిన భృతిని కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఇవ్వలేదని, 72 సంవత్సరాల పాటు నరకం అనుభవించామని, ఆర్టికల్ 370 రద్దు తరువాత తమకు నమ్మకం ఏర్పడిందని, తమకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నామని అంటున్నారు ఆ పాకిస్తానీ కుటుంబాలు.  


ఈ కుటుంబాలే కాదు.. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు ఇలానే ఇబ్బందులు పడుతున్నారు.  ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆర్టికల్ రద్దుకు ముందు వరకు కొంతమంది మాత్రమే లాభం పొందారు.  కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ అందరూ సమానమే.  అందరికి అన్ని హక్కులు ఉంటాయి.  ఎవరైనా సరే అక్కడ ఉండే హక్కు ఉన్నది.  అక్కడ పనులు చేసుకునే హక్కు ఉన్నది.  చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే హక్కులు ఉంటాయి.  అనుమతులు లభిస్తాయి.  


ఆర్టికల్ రద్దు ముందు వరకు యువతను పెడత్రోవ పట్టించారు.  ఉగ్రవాదం వైపుకు మళ్లించారు. రాళ్ళూ రువ్వే వ్యక్తులకు డబ్బులు ఇచ్చారు.  వాళ్లపై పోలీసు కేసులు పెట్టేందుకు వీలులేదు.  ఆర్మీని ఎన్ని ఇబ్బందులు పెట్టారో చెప్పక్కర్లేదు.  వాళ్ళను ఎన్ని అవమానాలు చేసినా సైలెంట్ గా ఉన్నారు.  ఫలితంగా అవమానాలు ఎదుర్కొంటూనే.. దేశానికీ సేవచేశారు.  ఇప్పుడు అంతా మారిపోయింది.  ప్రజలకు స్వేచ్ఛ ఇస్తూనే..ఎవరైనా తిరగబడితే.. వాళ్ళను అదుపులోకి తీసుకునే హక్కు పోలీసులకు ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: