మాములుగా ఆగష్టు 15 వ తేదీ వచ్చింది దేశవ్యాప్తంగా జెండా కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు.  ప్రతి గ్రామంలో, ప్రతి వాడాలో ప్రతి గల్లీలో జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తుంటారు.  మువ్వెన్నల జెండా ఎగురుతుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి.  ఆగష్టు 15 వ తేదీ ఉదయం నుంచి సందడి మొదలౌతుంది.  కొన్ని చోట్ల రెండు రోజుల ముందు నుంచే ఈ సందడి ప్రారంభం అవుతుంది. 


కర్ణాటకలో కనకప్పగడ్డలో ఆగష్టు 14 వ తేదీ అర్ధ రాత్రి అంటే తెల్లారితే ఆగస్టు 15 వ తేదీన జెండా ఎగురవేస్తారు.  ఆగష్టు 15 వ తేదీ సాయంత్రం అన్ని చోట్ల జాతీయ జెండాని వితరణ చేస్తారు.  అది ఆనవాయితీ.  ప్రభుత్వ కార్యాలయాలపై తప్పించి మరెక్కడా జాతీయ జెండాలు ఎగరవేయ కూడదు.  ఇదిలా ఉంటె ఓ రెండు నగరాల్లో మాత్రం జాతీయ జెండాను ఆగష్టు 15 వ తేదీన కాకుండా ఆగస్టు 18 వ తేదీన ఎగరవేస్తారట.  దీని వెనుక చాల పెద్ద చరిత్ర ఉన్నది.  


ఇండియా, పాకిస్తాన్ దేశాన్ని రెండుగా విభజించారు.  ఆ సమయంలో బెంగాల్ లోని రాయ్ ఘాట్, కృష్ణానగర్ ప్రాంతాలు పాకిస్తాన్ లో భాగం అయ్యాయి.  అంటే ఇప్పటి బంగ్లాదేశ్ అన్నమాట. ఈ రెండు నగరాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు.  దీంతో అప్పటి పాకిస్తాన్ ఈ రెండు నగరాలను తమ దేశంలో కలుపుకోవడానికి అంగీకరించలేదు.  దీంతో ఈ రెండు నగరాలు ఆగస్టు 18 వ తేదీన తిరిగి ఇండియాలో అంతర్భాగం అయ్యాయి.  


ఆగష్టు 18 వ తేదీన ఈ రెండు నగరాలు దేశంలో అంతర్భాగం అయినప్పటికీ ఆగస్టు 15 వ తేదీన మొదట్లో అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగేవి.  కానీ, స్వాతంత్ర సమరయోధుడు ప్రధక్ నాథ్ శుకుల్ మనమడు అంజన్ శుకుల్ ఆగస్టు 18 వ తేదీన జాతీయ జెండాను ఈ రెండు నగరాల్లో ఎవరవేసేందుకు అనుమతి ఇవ్వాలని పోరాటం చేశారు.  అయన పోరాటం ఫలించింది. అక్కడి మెజారిటీ ప్రజలు కూడా ఆగష్టు 18 వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అంగీకారం తెలపడంతో 1991 నుంచి అక్కడ ఆగష్టు 18 వ తేదీన జెండా ఎగురవేసేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రప్రభుత్వం.  అప్పటి నుంచి ఆగస్టు 18 వ తేదీన అధికారికంగా అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: