కేంద్రంలో రాజకీయాలను ఏలుతున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు నిదానంగా రాష్ట్ర రాజకీయాల్లో తమ ఆధిపత్యం చూపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొన్న కర్ణాటక రాజకీయాలలో మారిన సమీకరణాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోడీ కన్ను తెలంగాణ పైన పడింది. మొన్న ఈ మధ్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన అనుకూల ఫలితాలతో ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. అయితే మోడీ-అమిత్ షా ద్వయం కలిసి కేసీఆర్ కోసం ప్రత్యేకమైన వ్యూహాన్ని రచించారు. 

బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జే.పి నడ్డా తొలిసారి తెలంగాణలో కాలు మోపారు. ఇప్పుడు ఆయన ఒక పెద్ద అ సదస్సులో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు సాయంత్రం జరిగే మహా సమ్మేళనం లో తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది ప్రముఖ నాయకులు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఒక్క తెలుగుదేశం నుండి అయితే దాదాపు 20 వేల మంది వలస పోనున్నారు.

ఇక్కడే మొదలవుతుంది మోడీ మాస్టర్ ప్లాన్. కాంగ్రెస్ ను అసలు ప్రతిపక్ష పార్టీగా నిలబడినీయకుండా చేయడమే అతని ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రజలకు అయితే టిఆర్ఎస్ కాకపోతే బిజెపి అన్నట్లు ఆయన వాళ్ళ మనసుల్లో నాటనున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో అయితే కాంగ్రెస్ అస్సలు లేదు. మోడీ ప్లాన్ అర్థమైనా కేసీఆర్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు కమలం వైపు మొగ్గు చూపుతున్న వారిని తన పార్టీ లోకి తెచ్చుకోలేడు కదా.

అయితే ఇలా జరగడం వల్ల కేసీఆర్ కు పోటీ తగ్గి లాభమే వస్తుంది కానీ నష్టం ఎక్కడుంది అన్న సందేహం మీకు రావొచ్చు. ఇక్కడే మీరు మోడీని చాలా తక్కువగా అంచనా వేశారు. ఈ మధ్యనే బిజెపిలో చేరిన మాజీ ఎంపీ వివేకానంద అన్న మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పరిపాలన సాగిస్తున్నారు అని ఆయన అన్న మాటలు మంచి ప్రభావాన్ని చూపించాయి. ఇలా ముందు తమ పార్టీని బలోపేతం చేసుకొని తరువాత సరైన సమయంలో తెరాస ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కుంటారు. వారు కాస్తా ఇటు వైపుకి వచ్చి కేసీఆర్ పాలన పైన వ్యతిరేక భావాన్ని నూరిపోస్తారు. ఖేల్ ఖతం దుఖాన్ బంద్…!

ఇంత జరుగుతుంటే ప్రజలు ఏమీ పిచ్చి వాళ్లు కాదనే కదా మీ ప్రశ్న. ఇప్పటికే జాతీయ స్థాయిలో సంచలన నిర్ణయాలు తీసుకొని అందరి మన్ననలు అందుకుంటున్న మోడీ... తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హోదా లాంటి వరం ఏదైనా ఇస్తే ఎవరైనా ఏమంటారు ? వారు పాలనలోకి వస్తే ఏం చేయగలరు అని కనీసం శాంపిల్ చూపిస్తే చాలు తెలంగాణాలో కాషాయం జెండా ఎగిరేందుకు.

మరింత సమాచారం తెలుసుకోండి: