పాకిస్తాన్ ఇప్పుడు ఒక్కటే పాట పాడుతున్నది.  జమ్మూ కాశ్మీర్లో తిరిగి 370 ఆర్టికల్ ను ఇంపోజ్ చేయాలి.  అలానే కేంద్రపాలిత ప్రాంతాలుగా వాటిని రద్దుచేయాలి.  దీన్ని నెత్తిన ఎత్తుకొని పాకిస్తాన్ పనిచేస్తోంది.  కారణం ఏంటి.. ఎందుకు అలా చేస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎందుకు అలా ప్రవర్తిస్తోంది.. అంటే.. ఎలాగైనా జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ ఆలోచన.  


జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకుంటే.. అక్కడి సంపదను దోచుకోవచ్చు.  అంతేకాదు.. చైనాకు దగ్గర కావడానికి ఇది ఉపయోగపడుతుంది.  ఉగ్రవాదాన్ని మరింతగా ప్రేరేపించి ఉపఖండంలో అలజడులు సృష్టిస్తే... చైనాకు ఇబ్బంది ఉండదు.  చైనా బలపడుతుంది.  ఇండియా బలహీన పడుతుంది.  ఇది చైనా ఆలోచన.. ఆ ఆలోచనను చైనా పాక్ ద్వారా చేయిస్తున్నది.  


అందులో ఎలాంటి సందేహం లేదు.  చైనా తన డెవలప్మెంట్ కోసం ఎంతకైనా తెగిస్తుంది అనడంలో సందేహం లేదు.  పాకిస్తాన్ మాత్రం చైనా ఇచ్చే డబ్బులు, చైనా ఇచ్చే రాయితీల కోసం పనిచేస్తున్నది. అలజడులు సృష్టిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.  ఉగ్రవాద సంస్థలను నిర్మూలించాలనే తలంపుతో ఇచ్చే నిధులను దుర్వినియోగం చేస్తున్నది.  


దీంతో పాకిస్తాన్ కు అమెరికా ఇచ్చే మొత్తంలో కోతలు విధిస్తు వస్తున్నది.  కోతలు విధిస్తూ వస్తున్నా.. పాక్ మాత్రం అసలు తగ్గడం లేదు. అసలు విషయంలోకి వెళ్తే.. పాకిస్తాన్ నేతలు ఇప్పుడు నెహ్రు జపం చేస్తున్నారు.  కాశ్మీర్లో నెహ్రు రాజ్యం పోయి దోవల్ రాజ్యం ఏలుతోందని.. నెహ్రు గొప్ప వ్యక్తి అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  దీనికి కారణం లేకపోలేదు. 

నెహ్రునే జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు.  ఆర్టికల్ 370ని ఏర్పాటు చేయడంలో నెహ్రు కీలక పాత్ర పోషించారు.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ఉదారవాదం ప్రదర్శించడంతో జమ్మూ కాశ్మీర్లో చాలా భాగం కోల్పోయింది ఇండియా.  అయినప్పటికీ అదే విధమైన ఉదారవాదాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్ నెత్తిన కూర్చుంది.  ఇప్పుడు ఆ ఆటలు సాగకపోతుండటంతో రివర్స్ లో మాట్లాడుతున్నది పాకిస్తాన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: