మనం చిన్నప్పుడు ఓ కథ చదువుకొని ఉన్నాం... కుందేలు.. తాబేలు స్టోరీ.  ఈ కథ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.  కుందేలు చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఎక్కడఆగదు.  అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక చోట కూర్చొని నిద్రపోతుంది.  కానీ, తాబేలు అలా కాదు.. నడుస్తూనే ఉంటుంది.  అలా నడిచి నడిచి నడిచి.. చివరకు లక్ష్యం చేరుకుంటుంది.  కుందేలు మెలుకువ చేసి పరిగెత్తే సరికి లక్ష్యాన్ని కుందేలు చేరుకొని ఉండటం చూసి షాక్ అవుతుంది.  


తాబేలు శాఖాహారి.  నాచు, చిన్న చిన్న మొక్కలు తింటుంది. అయితే, ఉత్తరప్రదేశ్ లోని బాంస్ బలే గ్రామంలోని ఓ చిన్న కొలనులో కొన్ని తాబేళ్లు ఉన్నాయి.  అయితే, అది గ్రామం కావడంతో.. మహిళలు బహిర్భూమికి బయటకి వెళ్తుంటారు.  అలా బయటకు వెళ్లిన ఓ మహిళా పొరపాటున కాలుజారి నీళ్లలో పడింది.  ఆలా నీళ్లలో పడిన మహిళ బయటకు రాలేక మరణించింది.  


మరణించిన ఆ మహిళా మృతదేహాన్ని తాబేళ్లు ఛిద్రం చేశాయి.  అయితే, ఆమె బహిర్భూమికి వెళ్లి ఎంతసేపటికి కూడా తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ బంధువులు ఆమెకోసం వెతకడం మొదలుపెట్టారు.  చివరకు ఆ మహిళ కొలనులో పడి మరణించడంతో బంధువులు షాక్ అయ్యారు.  అయితే, ఆమె శరీరాన్ని తాబేళ్లు గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేశాయి. దీంతో ఆ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  



వెంటనే అధికారులు అక్కడి చేరుకొని ఆ మహిళా మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్ మార్టం చేశారు. ఆ తరువాత ఆ కొలనులో ఉన్న తాబేళ్లను అక్కడి నుంచి మరో చోటికి తరలించారు.  మహిళా మృతదేహాన్ని కోరికేసిన తాబేళ్లను చూసి చాలామంది భయపడిపోతున్నారు.  కామ్ గా ఉండే ఈ తాబేళ్లు ఇలా చేయడం చూసి ఆ గ్రామంలోని ప్రజలు షాక్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: