దేశంలో మోడీని అభిమానించే వ్యక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. విమర్శలు చేసిన వ్యక్తులు కూడా అభిమానిస్తున్నారు. తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. మోడీ బీజేపీ నేత కాబట్టి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ విమర్శించాలి కాబట్టి విమర్శలు చేస్తోంది.  కానీ, అంతర్గతంగా మాత్రం మోడీ అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకుంటూనే ఉన్నారు.  


అందుకు ఒక ఉదాహరణ.. ఇటీవలే జరిగింది.  మోడీ ఇటీవలే ఆగష్టు 15 వ తేదీన ఎర్రకోటపై అద్భుతమైన ప్రసంగం చేశారు.  ఈ ప్రసంగాన్న అనేకమంది మెచ్చుకున్నారు.  పొగడ్తల వర్షం కురిపించారు. అందులో చిదంబరం కూడా ఉన్నారు. మోడీ చేసిన ప్రసంగం అద్భుతం అని చెప్పారు.  సాహసంతో కూడిన మూడు పదాలు అందరిని టచ్ చేశాయని అన్నారు.  


కాగా, ఇప్పుడు ఆ లిస్ట్ లో బీజేపీ మాజీనేత, కాంగ్రెస్ పార్టీ నేత శత్రుఘ్నసిన్హా కూడా ఉన్నారు.  ఏ విషయాన్నైనా స్ట్రెయిట్ గా మాట్లాడే శత్రుఘ్నసిన్హా ఇప్పుడు మోడీపై తిరిగి పొగడ్తల వర్షం కురిపించారు.  మోడీ చేసిన ప్రసంగం అద్భుతమని, సాహసంతో కూడిన ప్రసంగం చేశారని.  జనాభా నియంత్రణ, ప్లాస్టిక్ వినియోగం, సంపద సృష్టించే వారిపట్ల గౌరవంపై మోడీ చేసిన ప్రసంగం ప్రశంసించదిగిందని అన్నారు.  


ఈ మూడు అమలు జరిగితే ఇండియా నెంబర్ అవుతుందని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. శత్రుఘ్న సిన్హా ఇలాంటి మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరిచింది.  మోడీపైన, బీజేపీపైన ఒంటికాలిపై లేచే శత్రుఘ్నసిన్హాలో మార్పు రావడం మంచిదే అని బీజేపీ నేతలు అంటున్నారు.  ఒక్క శత్రుఘ్నసిన్హా మాత్రమే కాదు.. భారత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు మోడీని అభిమానిస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు.  శత్రుఘ్నసిన్హా తిరిగి బీజేపీలో జాయిన్ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: