చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య తేడా ఏమిటో ఇక్కడే తెలిసిపోతోంది. భారీ వర్షాల కారణంగా జలమయమైన ప్రాంతాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ప్రభుత్వం యంత్రాంగం మొత్తం తిరుగుతున్నారు. యుద్ధప్రాతిపదికన పునరావాస చర్యలు చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. కాకపోతే ఇక్కడే ఓ విషయంలో జగన్ ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

 

ఇంతకీ జగన్ ప్రభుత్వం విఫలమైనది ఎక్కడంటే పబ్లిసిటిలోనే. ప్రభుత్వ యంత్రాంగం బాగానే పనిచేస్తోంది. కానీ పనులు చేయటం వేరు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవటం వేరు. పనులు జరుగుతున్నా దానికి సరైన ప్రచారం చేసుకోవటంలో మాత్రం మంత్రులు, అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయినట్లే కనిపిస్తోంది.  పనులు చేయటానికి చేసిన విషయం చెప్పుకోవటానికి మధ్యలో ఉండే గ్యాప్ లోనే చంద్రబాబు, టిడిపి నేతలు దూరేశారు.

 

జగన్ అమెరికాకు వెళ్ళాడని ఒకటే గోల చేస్తున్న టిడిపి నేతలు చంద్రబాబు, చినబాబు ఎక్కడ కూర్చున్నారనే విషయాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టేశారు. జగన్ అంటే అమెరికాలో ఉన్నారు సరే మరి చంద్రబాబు, చినబాబులు ఎక్కడున్నట్లు ? వరద ప్రభావ ప్రాంతాల్లో తిరక్కుండా హైదరాబాద్ లో కూర్చుని జగన్ పై ఆరోపణలు చేయటమేంటి ? అన్న విషయాన్ని చంద్రబాబును కాని టిడిపి నేతలను కానీ ఏ మీడియా కూడా ప్రశ్నించదు.

 

మీడియాలో తనకున్న దన్నును చూసుకుని జగన్ పై చంద్రబాబు బురద రాజకీయాలు ప్లే చేస్తున్నారు. దాంతో వరద ప్రాంతాల్లో జరుగుతున్న పనుల కన్నా బురదరాజకీయాలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. హుద్ హుద్, తిత్లీ తుపానుల సమయాల్లో చంద్రబాబు చేసిన పనులు తక్కువ,  అంతా చేసేసినట్లు ఇచ్చుకున్న బిల్డప్ ఎక్కువ. ఆ ఓవర్ యాక్షన్ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మీద చంద్రబాబుకు జగన్ కు మధ్య తేడా ఏమిటో మరోమారు స్పష్టమైపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: