టీడీపీ నేతల వాదనలు చూస్తే ఒక్కోసారి మతిపోతుంది.. తాజాగా ఓ టీడీపీ నేత చేసిన వాదన ఏంటంటే.. రాజధానిని ఇడుపులపాయకు తరలించేందుకే... అమరావతిని వరదల్లో ముంచేశారట. కావాలనే వరద నిర్వహణ సరిగ్గా చేయక.. అమరావతిని కావాలనే ముంచారట. ఇంతకీ ఈ వాదన చేసింది ఎవరనుకుంటున్నారు.. మాజీ జలవనరుల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావు.


రెండు, మూడు రోజులుగా ఆయన కృష్ణా వరదలపై విపరీతంగా స్పందిస్తున్నారు. కృష్ణా వరదలు పూర్తిగా మానవ తప్పిదం కారణంగా ఏర్పడిన విపత్తేనని చెబుతున్నారు. దీనిపై న్యాయ విచారణ డిమాండ్ చేస్తున్నామంటున్నారు. కేంద్ర హోం శాఖకు, జలవరుల శాఖకు ఫిర్యాదు చేసి న్యాయ విచారణ కొరతామంటున్నారు. వరద గేట్లు పర్యవేక్షణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


అంతేనా... ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారన్న ఉమా ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్క సమీక్ష కూడా పెట్టలేదమీ మండిపడుతున్నారు. అమరావతి ని ముంచటానికే కుట్రపూరితంగా వ్యవహరించారని సామాన్యులు సైతం మాట్లాడుతున్నారట. చంద్రబాబు ఇంటిని ముంచాలనే రాక్షసత్వం తప్ప మరొకటి లేదా అని దబాయిస్తున్నారు ఉమా.


చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగిన మంత్రులకు ప్రజలకు సహాయ చర్యలు అందించే తీరిక లేదా అని ప్రశ్నిస్తున్నారు. వరద బాధితులకు భోజనం పెట్టాలంటే ఆధార్ కార్డు, తెల్ల కార్డు అడుగుతున్నారని అంటున్నారు.అక్కడితో ఆగితే బాగానే ఉంటుంది.. కానీ.. ఏపీలో సగం మంది ఇరిగేషన్ అధికారులు పోలవరం రీ టెండరింగ్ లో ఉన్నారట. ఇంకో సగo మంది జలవనరుల అధికారులను తెలంగాణ భూభాగంలో కాల్వలు తవ్వటానికి పంపారట. మిగిలిన వాళ్ళు జగన్ బంధువు పీటర్ వద్ద సలహాల కోసం ఉన్నారన్నారు. అందుకే వరదను ఎవరూ పట్టించుకోలేదట. టీడీపీ నేతలకు ఇలాంటి విమర్శల ఐడియాలు ఎలా వస్తాయో అని ఆశ్చర్యపోతున్నారు వైసీపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: