కోచ్  ఎంపికలో పారదర్శకత ఏది?

 భారత క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసిన విధానం  సరిగా లేదని, ఎంపిక ప్రక్రియ జరిపిన క్రికెట్ సలహా కమిటీ నైతికత అనేది ప్రశ్నార్థకమైంది   అంటూ నెటిజన్లు ఎంపిక కమిటీ పైన మండిపడుతున్నారు. ఎంపిక చేసిన కోచ్ పేరు ప్రకటించే సమయంలో  కమిటీ అవలంబించిన విధానం టూ సరి కాదు అంటూ అంతర్జాలం లో గగ్గోలు పెడుతున్నారు.  

ఎవరిని ఎంపిక చేయాలో ముందే నిర్ణయించుకుని  ప్రకటించినట్లుగా కోచ్ ఎంపిక కమిటీ ప్రవర్తించిoదని నెటిజన్లు  దుయ్య బడుతున్నారు. ఈ ప్రహసనం అంతా కాకాకుండా రవిశాస్త్రి పేరే  ప్రకటించి ఉంటే బాగుండేదని కానీ క్రికెట్ సలహా కమిటీ భారత ప్రజలను మభ్యపెట్టి     లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిందని అంతర్జాలo ద్వారా నెటిజన్లు మండిపడుతున్నారు.

 న్యూజిలాండ్ క్రికెట్ జట్టు  మాజీ కోచ్ మైక్ హెసన్ పేరు తప్పుగా రాయడం  కూడా నెటిజన్ల ఆగ్రహం కట్టలు పోతేoచుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తున్నది.   ఒకవేళ పేరు సరిగా తెలియకుంటే అంతర్జాలంలో వెతికినా సరిపోయేది కదా అన్నది నెటిజన్ల  భావన గా కనిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ కోచ్ పదవికి ఎవరిని ఎంపిక చేయాలో నిర్ణయించుకుని బరిలోకి దిగిన సలహా కమిటీ  అందరూ అనుకున్నట్టే ఎంపిక ప్రక్రియ ఒక ప్రహసనం అని నిరూపించి రవిశాస్త్రినీ తిరిగి కొనసాగిందని నెటిజన్లు ఆగ్రహంతో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: