ఏపీ రాజకీయాల్లో ఎదగాలన్నది పవన్న కల్యాణ్ డ్రీమ్.. అలాంటి కలలు ఉండటం తప్పేమీ కాదు.. అలాంటి కలలు ఉంటేనే కసిగా రాజకీయాల్లో పని చేస్తారు.. ప్రజల కోసం పని చేస్తారు. గుర్తింపు తెచ్చుకుంటారు. అంతవరకూ ఓకే.. కానీ పవన్ కల్యాణ్ ఇటీవలి ధోరణి చూస్తుంటే.. ఆయన స్వతంత్ర్యంగా ఎదగకుండా... తెలుగుదేశానికి తోక పార్టీగా మిగులుతున్నారేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


అందుకు పవన్ కల్యాణ్ తాజా డైలాగులే సాక్ష్యంగా నిలుస్తున్నాయంటున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చిన వేళ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు పార్టీల వైఖరుల్లోనూ లోపాలున్నాయి. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ నేతలను వెనకేసుకొచ్చేలా మాట్లాడరని విశ్లేషకులు భావిస్తున్నారు.


కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే...వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే.. వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధిగా పేర్కొన్న పవన్....కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత అంటూ ప్రశ్నించారు.


డ్రోన్లు కేవలం కరకట్ట భవనాల కోసమే వాడారని పవన్ ఎలా అనుకుంటున్నాడు.. కృష్ణాతీరమంతా వాడామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెబుతున్నారు కదా.. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్ళి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారంటున్న పవన్ కు మంత్రులు చేసిన ఇతర పర్యటనలు మాత్రం కనిపించడం లేదు.


వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ.. ప్రతిపక్షం సరిగ్గా లేదని తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీ ప్రతిపక్ష హోదాలో ఉండి.. బురద రాజకీయాలు చేస్తుంటే మాత్రం పవన్ కల్యాణ్ పట్టించుకోరన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: