పాపం.. చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయాల్లో బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది.. పార్టీ నుంచి నా అనుకున్న వాళ్లంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. చంద్రబాబు సన్నిహితులుగా బాగా పేరున్న వారు సైతం బీజేపీలోకి వెళ్తున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్, గరికపాటి మోహన రావు వంటి వారు చంద్రబాబుకు బాగా క్లోజ్ అని పేరున్నవారు.


గరికపాటి మోహనరావు దశాబ్దాల తరబడి టీడీపీలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో చేరి చంద్రబాబు పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ విభజన తర్వాత చంద్రబాబు ఏనాడూ పార్టీ ని పట్టించుకున్న పాపాన పోలేదంటున్నారు గరికపాటి మోహనరావు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ సభలో ఆయన ప్రసంగించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఈ సభకు వచ్చే వాలాది మందిని రోడ్లపైనే ఆపేశారు.. ఎన్ని అడ్డంకులు తెచ్చిన భాజపా సైన్యాన్ని ఆపలేరు .. పల్లె పల్లెకు తిరిగి పార్టీని బలోపేతం చేసుకుందాం.. బాధతోనే టీడీపీ పార్టీని వీడాం.... వీడుతున్నాం .. 26 ఏళ్ల వయసులో తెదేపాలో చేరాం...అప్పుడు చేరిన వారు ఎవ్వరు లేరు.. సుఖాల్లో కాకపోయిన కష్టాల్లో పార్టీ వెంట ఉన్నాం..


బాబ్లీ ఉద్యమంలో తెలంగాణ కార్యకర్తల విపులే పగిలాయి.. నేను దొరల భూస్వామి బిడ్డను కాదు .. 2014 తర్వాత తెలంగాణలో తెదేపా పార్టీ శాఖ పనితీరు మీ అందరికీ తెలుసా.. తెలంగాణ తెదేపాను బ్రతికియ్యాల లేదా అన్నది అర్ధం కాకుండా పోయింది.. నేను పార్టీ నేతలను ఏం చేస్తున్నారని అడిగితే పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు.. 15ఏళ్లగా పోరాటం చేసిన శోభకు టికెట్ ఇవ్వలేదు..


ఆరు జిల్లాల్లో కనీసం పోటీ చేయలేదు.. మనసు చంపుకొని భాజపాలో చేరుతున్నా.. పదవులు ఆశించి చేరడం లేదు.. గోల్కొండ కోట మీద భాజపా జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పని చేస్తాం.. అంటూ ముగించారు గరికపాటి మోహన రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: