తలాక్ బిల్లు సక్సెస్ అయ్యింది .. జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్రం సక్సెస్ సాధించింది.  జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.  లడక్ ప్రజల కోరికను నెరవేర్చింది.  ఇప్పుడు కేంద్రం చూపులు హైదరాబాద్ పై ఉన్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తోంది.  ఎప్పటి నుంచో హైదరాబాద్ ను దేశానికీ రెండో రాజధానిని చేయాలనీ అనుకుంటున్నారు.  ఎందుకంటే..రెండో రాజధాని ఉండటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.  


పరిపాలన సౌలభ్యం కోసం ఇలా చేయడం చాలా అవసరం.  దక్షిణాదిన ఉన్న ప్రజలు ఏదైనా అవసరమైతే ఢిల్లీ దాకా రావాలి.  అందరు రాలేరు.  నాయకులతో అవసరమైన ఢిల్లీ దాకా రావాలి అది కష్టం.  అందుకే ఎప్పటి నుంచి హైదరాబాద్ ను రెండో రాజధానిని చేస్తే దానివలన కొంతమేర ఇబ్బందులు తగ్గుతాయి అన్నది చాలామంది వాదన.  అయితే, దీనికి బీజేపీ ఒప్పుకుంటుందా అన్నది సందేహమే.  


ఎందుకంటే, ఒకే దేశం, ఒకే జెండా, ఒకే న్యాయం అనే తరహాలో వెళ్తున్నది.  ఇప్పుడు రెండో రాజధాని అంటే ఒప్పుకోవడం కష్టమే అంటున్నారు కొంతమంది నాయకులు.  హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.  రాజధానిని చేయడం వలన హైదరాబాద్ లో రక్షణ వ్యవస్థ పెరుగుతుంది.  దేశంలో ఏక్కడ ఎలాంటి అలజడులు జరిగినా దానికి మూలాలు హైద్రాబాద్లో ఉన్నాయని అని వాదించేవారు చాలామంది ఉన్నారు.  
సో, అలాంటప్పుడు హైదరాబాద్ ను రెండోరాజధానిగా మారిస్తే.. ఉపయోగమే కానీ నష్టం ఉండదు.  ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపినట్టు ఉంటుంది.  పైగా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ అయ్యేవిధంగా చూసేందుకు అనుకూలత ఏర్పడుతుంది.  అందుకోసమైనా హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలి.  హైదరాబాద్ లో రాష్ట్రపతి విడిది గృహం కూడా ఉన్నది.  ప్రతి ఏడాది హైదరాబాద్ వచ్చి రాష్ట్రపతి కొన్ని రోజులు ఉండి వెళ్తుంటాడు.  


హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి.  ఇక్కడ సుప్రీం కోర్ట్ బెంచ్ ను ఏర్పాటు చేయడం వలన ప్రజలకు భారం తగ్గించినట్టు అవుతుంది.  భారం తగ్గడమే కాదు.. న్యాయవ్యవస్థపై గౌరవం కూడా పెరుగుతుంది.  కాబట్టి ఈ విషయంలో కేంద్రం ఒకసారి అలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా.  మరి కేంద్రం ఎలా ఆలోచిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: