పాకిస్తాన్ ముస్లిం దేశం.. అక్కడ ముస్లింలు మినహా మిగతా వారంతా మైనారిటీలు.  భారతదేశం రెండుగా విడిపోయిన తరువాత పాకిస్తాన్లో ఉన్న చాలామంది హిందువులు తిరిగి ఇండియాకు వచ్చారు.  కానీ, కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు.  అలా అక్కడే ఉన్న హిందువుల ఇప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  వారి ఇబ్బందులను గురించి అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  


మైనారిటీలుగా ఉన్నా వాళ్లకు ఉద్యోగాలు లేవు.  ఏదైనా సొంతంగా సంపాదించుకుంటే దానిపై అక్కడి వాళ్ళ కన్ను పడుతుందని చాలామంది హిందువులు వాపోతున్నారు.  హిందువుల పండుగల సమయంలో అనేక ఆంక్షలు ఉంటాయట.  భారీ ఎత్తున చేసుకోవడానికి వీలులేదు.  ఇదిలా ఉంటె, పాకిస్తాన్ లో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి.  వాటిల్లో చాలా వరకు ద్వాంసం అయ్యాయి.  కొన్నింటిని ప్రభుత్వం మరమ్మత్తులు చేయించినా అవి తాత్కాలికమే.  


ఇక కొన్ని దేవాలయాలపై షరతులు విధించడంతో అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు.. వందల సంవత్సరాల నాటి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.  వాటిని పట్టించుకునే వ్యక్తులు కరువు.  పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య తక్కువ.  కరాచీలో దాదాపుగా 30వేల కుటుంబాలు నివసిస్తున్నాయి.  వీరు పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  


ఎందుకంటే, అక్కడ పెళ్లి చేసుకోవాలి అంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి.  ఎలాంటి హడావుడి లేకుండా చేసుకోవాలి.  అసలు పెళ్లి జరిగిందా లేదా అన్నది కూడా తెలియడంలేదు.  అంతేకాదు, హిందువులపై అక్కడ దాడులు కూడా జరుగుతుంటాయట.  అందుకే చాలామంది హిందువులు మతం మార్చుకుంటున్నారు.  లేదంటే విదేశాలకు వెళ్లిపోతున్నారు.  కొందరు ఏం చేయలేక అలాగే బ్రతుకును నడుపుతున్నారట.  పెళ్లి చేసుకోవడానికి చాలామంది ఇండియా వస్తున్నారు.  ఇండియా వచ్చి పెళ్లి చేసుకొని తిరిగి వెళ్తున్నారు.  ఇలా చేయడం కష్టమే కానీ తప్పడం లేదని అంటున్నారు.  ఇండియాలో ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇండియాలోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నామని ఇలా వచ్చి వివాహం చేసుకున్న దంపతులు చెప్తున్నారు.  ఒక్క హిందువులే కాదు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న కాశ్మీర్ ప్రజలు కూడా తిరిగి ఇండియాలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు.  అక్కడ ప్రతినిత్యం అరాచకాలు జరుగుతున్నాయి. కానీ, ఇది ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ జాగ్రత పడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: