రంగారావుకు జై కొడ‌తారా..?ఈ ద‌ఫా ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాభ‌వాన్ని చ‌వి చూసింది. ఆ పార్టీ త‌రుపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధులు సీనియ‌ర్లు, జూనియ‌ర్లు అన్న తేడా లేకుండా డిపాజిట్‌లు కోల్పోయిన ప‌రిస్థితి. వారంద‌రి రాజ‌కీయ భ‌విత‌వ్యం అలా ఉంటే మాజీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌లైన నాటి నుంచే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఒక‌ప‌క్క ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వం. మ‌రోప‌క్క ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్న కే -ట్యాక్స్ బాధితులు.


వారిలో టీడీపీ వారు కూడా ఉండ‌టంతో పూర్తిగా డిఫెన్స్‌లో ప‌డిపోయిన ప‌రిస్థితి కోడెల శివ‌ప్ర‌సాద్‌ది.ఈ నేప‌థ్యంలో ఒక‌ప‌క్క కే- ట్యాక్స్ బాధితుల కేసులు కోడెల‌ను వెంటాడుతుంటే.. మ‌రోప‌క్క ఆయ‌న వ్యతిరేక వ‌ర్గం ఏకంగా చంద్ర‌బాబును క‌లిసి ఆయ‌న మాకొద్దూ అంటూ ఖరాకండిగా తేల్చిచెబుతున్నారు. అయితే త‌మ కుటుంబ రాజ‌కీయాల‌కు కంచుకోట‌గా ఉన్న న‌ర్సారావుపేట‌ను వ‌దిలిన కోడెల శివ ప్ర‌సాద్ స‌త్తెన‌ప‌ల్లిలో త‌న రాజ‌కీయ స‌త్తాను చాటాల‌ని భావించారు. ఆ మేర‌కు 2014 ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా కోడెల గెలుపొందారు కూడా. కానీ గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో కోడెల కుటుంబ స‌భ్యులు స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌ల‌ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టేలా చేశాయి. ఇలా కంచుకోట అయిన న‌ర్సారావుపే, వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం స‌త్తెన‌ప‌ల్లి రెండూ కోడెల ఫ్యామిలీ నుంచి చేజారాయి.


ఇదిలా ఉండ‌గా, స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కోడెల శివ ప్ర‌సాద్‌ను వీలైనంత త్వ‌రగా దించెయ్యాల‌ని ఆయ‌న అస‌మ్మ‌తి వ‌ర్గం చంద్ర‌బాబు వ‌ద్ద గ‌ట్టిగానే డిమాండ్ చేస్తోంది. కోడెల వ్య‌హారంలో అస‌మ్మ‌తివ‌ర్గంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు చంద్ర‌బాబు రాయ‌పాటి రంగారావును రంగంలోకి దించారు. ఇప్పుడు ఈ యాంగిల్ కూడా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అయితే, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే టికెట్‌ను త‌న కుమారుడు రాయ‌పాటి రంగారావుకు ఇవ్వాల‌ని సాంబ‌శివ‌రావు చంద్ర‌బాబును కోరారు.


ఈ క్ర‌మంలో కోడెల వ్య‌వ‌హారాన్ని స‌ద్దుమ‌ణిగించేందుకంటూ చ‌ర్చ‌లు జ‌రిపేందుకు వ‌స్తున్న రాయ‌పాటి రంగారావుపై రాజ‌కీయ విశ్లేష‌కుల దృష్టి మ‌ళ్లింది. అస‌మ్మ‌తివ‌ర్గంతో కోడెల‌కు జై కొట్టిస్తారా..?   లేక వారితో త‌న‌కే జై కొట్టేలా చేయించుకుంటారా..? అన్న పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో న‌డుస్తోంది. మ‌రోప‌క్క చంద్ర‌బాబు సైతం స‌త్తెన‌ప‌ల్లికి కొత్త ఇన్‌చార్జ్‌ని నియ‌మించేందుకు ఆలోచ‌న‌లు చేస్తున్నారంటూ టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాయ‌పాటి రంగారావు ఎంట్రీపై థింకింగ్ చేయాల్సిందేనంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: