మాములుగా అందరు ఆఫీస్ లకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్లారు.. బైక్స్, కార్లు లేదంటే బస్సుల్లో వెళ్లారు.  అయితే, బ్రిటన్ కు చెందిన టామ్ అనే వ్యక్తి ప్రతిరోజూ తన ఇంటి నుంచి ఆఫీస్ కు గాల్లో ఎగురుకుంటూ వెళ్లారట.  ఇంటి నుంచి 30 కోలోమీటర్ల దూరంలో ఉండే ఇంటికి గాల్లో తేలుకుంటు వెళ్లడం ఏంటి అనే డౌట్ రావొచ్చు.  అక్కడికే వస్తున్నా.. పారామోటార్ గ్లైడర్ ఈ పేరు వినే ఉంటారు.  వీపుకు పెద్ద ఫ్యాన్ కట్టుకొని ప్యారాచూట్ సహాయంతో గాల్లోకి ఎగరడం.  ఇలా గాల్లోకి ఎగిరి ప్రయాణాలు చేస్తుంటారు.  


టామ్ ప్రైడో-బ్రూన్ ఆఫీస్ నైరుతి ఇంగ్లండ్‌ లోని విల్ట్‌షైర్‌ లో ఉంది. వాతావరణం అనుకూలిస్తే, ఆయన ప్రతిరోజూ ఆఫీసుకు ఇలాగే వెళ్తుంటారు."ఒక పైలెట్‌లా నేను ప్రతిరోజూ ఉదయం లేవగానే కిటికీల కర్టెన్లు తీసి బయట వాతావరణం చూస్తుంటాను" అంటారు టామ్. "ఈరోజు ఉదయం వాతావరణం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఇది కారు నడపడం కంటే హాయిగా ఉంటుంది. దానికి నాది భరోసా" అంటారు టామ్.

ప్రైడో-బ్రూన్ సిటీలో బైక్‌పై వెళ్తుంటారు. లేదంటే నడిచి వెళ్లడాన్ని ఇష్టపడతారు. కానీ, గాల్లో ఎగరడం ఆయనకు చాలా థ్రిల్‌గా, సరదాగా ఉంటుంది. షెర్‌బోర్న్‌లోని ఇంటి నుంచి డార్సెట్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్లడానికి ఆయన గాల్లో రోజూ 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. ఇలా ప్రయాణించడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.  ఎలాంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగవు.  అందుకే అయన ఇలాంటి ప్రయాణాన్ని ఎంచుకున్నారు.  


ఇంటి నుంచి బయలుదేరి గాల్లో అలా ఎగురుకుంటూ వెళ్తుంటే.. మనసుకు చాలా హ్యాపీగా ఉంటుందని, అయితే, లండన్ లో ఇలా చేయడం కుదరదని, అక్కడ పెద్ద పేద భవనాలు అడ్డంకులుగా ఉంటాయని అన్నారు.  దీనికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుందని టామ్ చెప్పారు.  టామ్ ఒక్కరే కాదు.. ఆ ఆఫీస్ లో పనిచేస్తున్న చాలామంది ఇలా పారామోటార్ గ్లైడర్ పై వస్తుంటారట.  ఐడియా బాగుంది కదా.  మనకు ఇలాంటి వాటికీ అనుమతి ఉంటె బాగుంటుంది కదా.  హైదరాబాద్ లాంటి నగరాల్లో వీటికి అనుమతి ఇవ్వరు.  కారణం ఏంటి అంటే ఎత్తైన బిల్డింగ్స్ తో పాటు ఎక్కడపడితే అక్కడ కరెంట్ తీగలు అడ్డదిడ్డంగా ఉంటాయి.  ఇది చాలా డేంజర్.  


మరింత సమాచారం తెలుసుకోండి: