ఆయనో తెలుగు దేశం నేత.. రాజ్యసభ సభ్యుడు కూడా.. చంద్రబాబుకు చాలా సన్నిహితుడుగా పేరున్నవాడు.. పార్టీని దశాబ్దాల తరబడి నమ్ముకున్నవాడు.. చంద్రబాబుకు అండదండగా ఉన్నవాడు.. కానీ ఇప్పడు సీన్ మారింది. ఇక చంద్రబాబు దగ్గర ఉంటే ఫ్యూచర్ ఉండదనుకుని పార్టీ మారాడు. బీజేపీలో చేరాడు..


ఆ సందర్భంగా బీజేపీ సభలో ఆయన టీడీపీలో తనకు జరిగిన అవమానాలను ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.. ఆయన ఆద్వర్యంలో పలువురు టిడిపి నేతలు బిజెపిలో చేరారు. గరికపాటి బీజేపీలో చేరే సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీలో తనకు ఎదురైన అవమానాలను ఆయన గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు.


తాను పదవుల కోసం బీజేపీలో చేరలేదని చెప్పారు. తన వెంట బీజేపీలో వచ్చిన టీడీపీ నాయకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సభకు వచ్చే వాలాది మందిని రోడ్లపైనే ఆపేశారు.. ఎన్ని అడ్డంకులు తెచ్చిన భాజపా సైన్యాన్ని ఆపలేరు .. పల్లె పల్లెకు తిరిగి పార్టీని బలోపేతం చేసుకుందాం.. బాధతోనే టీడీపీ పార్టీని వీడాం.... వీడుతున్నాం ..అన్నారు గరికపాటి.


26 ఏళ్ల వయసులో తెదేపాలో చేరాం...అప్పుడు చేరిన వారు ఎవ్వరు లేరు.. సుఖాల్లో కాకపోయిన కష్టాల్లో పార్టీ వెంట ఉన్నాం.. బాబ్లీ ఉద్యమంలో తెలంగాణ కార్యకర్తల విపులే పగిలాయి.. నేను దొరల భూస్వామి బిడ్డను కాదు .. 2014 తర్వాత తెలంగాణలో తెదేపా పార్టీ శాఖ పనితీరు మీ అందరికీ తెలుసా.. తెలంగాణ తెదేపాను బ్రతికియ్యాల లేదా అన్నది అర్ధం కాకుండా పోయింది.. నేను పార్టీ నేతలను ఏం చేస్తున్నారని అడిగితే పట్టించుకున్న నాదుడే లేకుండా పోయాడు.. 15ఏళ్లగా పోరాటం చేసిన శోభకు టికెట్ ఇవ్వలేదు.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు గరికపాటి మోహనరావు.


మరింత సమాచారం తెలుసుకోండి: