నిజంగా తెలుగుదేశంపార్టీ నేతలు చేసే ఆరోపణలు భలే విచిత్రంగా ఉంటాయి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తాము చెప్పేదాన్నే జనాలు నమ్మాలని చాలా బలంగా కోరుకుంటారు. జనాలు నమ్మటం లేదని అర్ధమైతే అదే అబద్ధాన్ని పదే పదే తమ మీడియా ద్వారా చాటుతుంటారు. జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటన విషయంలో కూడా ఇపుడు జరుగుతున్నది ఇదే.

 

జగన్ అమెరికా పర్యటనకు వెళ్ళారంటే ఆ పర్యటన ఇప్పటికప్పుడు ఖరారైనది కాదు కదా ?  అధికారంలో ఉన్నపుడు ఎన్నిదేశాలు తిరిగారో కూడా లెక్కలేని చంద్రబాబుకు ఇంతచిన్న విషయం తెలీకుండానే ఉంటుందా ? అలాగే భారీ వర్షాల విషయాన్ని మంత్రులు, చీఫ్ సెక్రటరితో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో  జగన్  ఎప్పటికప్పుడు సమీక్షిస్తునే ఉన్నారు.

 

తుపాను, వరద ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు చేపట్టటానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. ముఖ్యమంత్రి నేరుగా బాధిత ప్రాంతాలకు వెళ్ళి పలుగు, పారా పట్టుకోని రంగంలోకి దిగరు కదా ? మూడుసార్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఇంత చిన్న విషయం కూడా తెలీదా ?  గతంలో హుద్ హుద్, తిత్లీ తుపానుల సమయంలో చంద్రబాబు ఏం చేశారు ? రూ. 5 కోట్ల విలువైన బస్సులో కూర్చుని రివ్యూలు పెట్టేవారు. పబ్లిసిటి పిచ్చితో ఎక్కడపడితే అక్కడంతా తిరుగుతూ పునరావస పనులకు అడ్డంపడేవారు.

 

కానీ ఇపుడు జగన్ అలా కాకుండా పునరావాస కార్యక్రమాలు  ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటూ ఎవరి పనులు వాళ్ళను చేసుకోనిస్తున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, కలెక్టర్లు ఇలా..ఎవరికి వారుగా వరద ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పనులు జరిగిపోతున్నాయి. అదే టిడిపి నేతలకు బాగా కడుపుమంటగా ఉంది.

 

వరదలప్పుడు జగన్ అమెరికాకు వెళ్ళటమేంటి అని అడుగుతున్న పచ్చ తమ్ముళ్ళు ఒక విషయాన్ని మరచిపోయినట్లున్నారు. చంద్రబాబు, లోకేష్ ఎక్కడున్నట్లు ? వరద ప్రాంతంలో ఉండాల్సిన తండ్రి, కొడుకులు ఆ ప్రాంతాల్లో తిరగకుండా హైదరాబాద్ లో ఎందుకు కూర్చున్నట్లు ?  హైదరాబాద్ లో కూర్చుని ఏపిలో బురద రాజకీయాలు  చేయటమేంటి ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: