చట్టాలుఎన్నివచ్చినా,ప్రభుత్వాలుఎన్ని మారినా ఈ దేశంలోని మహిళలకు రక్షణకల్పించే పరిస్థితిలో లేవు.మహిళా చట్టాలూ ఎన్నివున్నా,పురుషాధిక్య భావజాలాలపై పైపూతగానే పనిచేస్తుంటాయి.ఈ పరిస్థితుల్లో ఏమతానికి చెందిన మహిళలైనా వారి జీవితంలో న్యాయం అందుకున్న సందర్భాలు చాలా తక్కువ.ఇక ఈమధ్య ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇన్‌స్టంట్‌ త్రిపుల్‌ తలాక్‌ బిల్లు'పై వెల్లువెత్తుతున్న ప్రతికూల వాదనలు,సానుకూల స్పందనలు గమనిస్తే,ముస్లిం సమాజంపై,కుటుంబాలపై,భార్యాభర్తల సహజీవన సంబంధాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.



ఇంతకు ఈ బిల్ మహిళల రక్షణకోసమా,మగవాళ్ల అవసరంకోసమా అనేవిషయం అర్దంకాకుండ వుంది.మొత్తంగా ముస్లింమహిళలకు కొత్త కష్టాలు తీసుకొచ్చిందనేది కొందరి వాదన.అంతేకాకుండ కుటుంబ జీవనంలో రాజ్యం ప్రమేయం ఎంతవరకు?అన్నదానిపైనా దేశవ్యాప్తంగా చర్చకూడజరిగింది.ఇక ఏమనుకున్నారో ఏమో కేంద్ర ప్రభుత్వపెద్దలు,దీన్ని రద్దుచేస్తూ బిల్లు తీసుకొచ్చారు.ఈ బిల్లు ఉభయసభల్లో కూడ ఆమోదంపొందింది.ఐతే బిల్లు ఆమోదంపొందినా ఇంకా తలాక్ చెప్పి విడిపోతున్నారు.అంతేకాకుండా మహిళలపై దాడులకుతెగబడుతున్నారు.మరికొందరైతే టెక్నాలజీని ఇందులోకూడవాడుకుని ఫోన్ ద్వారా లేదా టెక్ట్స్‌మెసేజ్‌లద్వారా లేదా ఈ మెయిల్‌ద్వారా తలాక్ అనిచెప్పేస్తున్నారు.



ఇదిలా ఉంటే,ముమ్మూరు తలాక్ చెప్పేందుకు ఓ మహిళా అంగీకరించకపోవడంతో కన్నబిడ్డ కళ్ళముందే భార్యను హతమార్చాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళ్లితే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.ఉత్తరప్రదేశ్ లోని శ్రావప్తి ప్రాంతానికి చెందిన రఫీక్ మహారాష్ట్రలో పనులు చేస్తుండేవాడు.అయితే,కొన్నిరోజులక్రితం భార్యకు ఫోన్ చేసి ముమ్మూరు తలాక్ చెప్పాడు.అందుకు ఆమె అంగీకరించలేదు.దీంతో ఆ వ్యక్తి కోపంతో కన్నబిడ్డ కళ్లెదురుగానే కిరోసిన్ పోసి తగలబెట్టాడు.ఈ విషయాన్ని వెంటనే అక్కడే ఉన్న చిన్నారి తన మేనమామకు తెలియజేయగా పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసును విచారిస్తున్నారు.ఈ మధ్యకాలంలో తలాక్ విషయంలో ఇలాంటిసంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి,ఏదిఏమైనా భార్యా భర్తలు విడిపోవాలంటే ఇది సరైన విధానం కానేకాదని కొందరి అభిప్రాయం పెళ్ళి అనేది మూన్నాళ్లముచ్చటగా మారిన ఈ కాలంలో వాటివిలువలు తెలియజేసి ఆ బందాన్ని బలపరిచే చట్టం ఏదైనా వస్తే బాగుంటుదనేది ముస్లిం మహిళల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: