కరకట్ట మీద అక్రమంగా నివాసముంటున్న తన ఇంటిపై ద్రోన్లు ఎగరటం ఏమిటి ? అంటూ చంద్రబాబునాయుడు ఒకటో గోల చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అదే సమయంలో రెండు రోజుల పాటు టిడిపి నేతలు ద్రోన్ల విషయమై ఎంతటి బురద రాజకీయం చేశారో అందరూ చూసిందే. మరి అదే సమయంలో చంద్రబాబు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల ఫొటో ఒకటి ఈనాడులో కూడా ప్రచురితమయ్యాయి. పైగా ఆ ఫొటోకు పక్కనే బ్రాకెట్లో ద్రోన్లతో చిత్రీకరించిన ఫొటో అని కూడా పెట్టారు.

 

ఇదే విషయమై వైసిపి నేతలు అడుగుతున్న ప్రశ్నలకు టిడిపి నేతల నుండి సమాధానం రావటం లేదు. నిజానికి చంద్రబాబుకు జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉన్న చంద్రబాబు ఇంటి మీద ప్రైవేటు వ్యక్తుల ద్రోన్లు మాత్రమే ఎగరకూడదు. వరద ముంపు ప్రాంతాలను అధ్యయనం చేయటానికి ఇరిగేషన్ శాఖే ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని ద్రోన్లను ఉపయోగించుకున్నది.

 

ఇదే ఏజెన్సీ ప్రకాశం బ్యారేజిలో నీటి మట్టం, బ్యారేజీ నుండి కృష్ణానదిలోకి వచ్చే నీటి ఉధృతిని కూడా ద్రోన్లతో చిత్రీకరించింది. అలాగే కరకట్ట పరిస్ధితిపై ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్ధితులు తెలుసుకునేందుకే తాము ద్రోన్లను ఉపయోగించినట్లు ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ స్వయంగా చెప్పారు. అయినా సరే టిడిపి నేతలు ప్రభుత్వ వాదనను అంగీకరించటం లేదు. చంద్రబాబు ఇంటిపై ద్రోన్లను ఉపయోగించకూడదనే పిడి వాదనను వినిపిస్తున్నారు.

 

సరే కాసేపు ఆ విషయమే నిజమనుకుందాం. మరి ఈనాడులో మాత్రం ద్రోన్లు ఉపయోగించి తీసిన చంద్రబాబు ఇంటి  ఫొటో ఎలా వచ్చిందని వైసిపి నేతలు నిలదీస్తున్నారు. ఈనాడు సంస్ధ మాత్రం ద్రోన్లను ఉపయోగించి ఫొటోలు తీసుకోవచ్చా ? అప్పుడు చంద్రబాబు ఇంటికి భద్రత ఉన్న విషయం గుర్తుకురాలేదా ? అని వైసిపి నేతలు అడుగున్నారు. అడ్డుగోలు వాదన లాగే అధికారం కూడా చెలాయించారు కాబట్టే జనాలు గూబ గుయ్యిమనిపించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: