ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.  ఇప్పటి వరకు అత్యంత పాపులర్ ప్రధాని ఎవరు అనే దానిపై ప్రముఖ మీడియా చానళ్ళు నిర్వహించిన సర్వేలలో మోడీ అగ్రస్థానంలో నిలిచాడు.  మోడీ తరువాత స్థానంలో ఇందిరాగాంధీ ఆ తరువాత స్థానంలో వాజ్ పాయి ఉండటం విశేషం.  ఇందిరాగాంధీనే మొన్నటి వరకు టాప్ లో ఉన్నారు.  


ఎప్పుడైతే మోడీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి ఇందిరాగాంధీ ఛరిష్మా తగ్గుతూ వస్తున్నది. రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఎంత కఠినమైన సరే అమలు చేస్తున్నారు.  ఇలా అమలు చేస్తున్న నిర్ణయాల్లో త్రిపుల్ తలాక్ ఒకటి.  ముస్లిం మహిళల కోసం దీనిని ప్రవేశపెట్టారు.  అలానే ఆర్టికల్ 370ని రద్దు చేశారు.  ఎప్పుడైతే ఈ ఆర్టికల్ ను రద్దు చేశారో అప్పటి నుంచి పక్కన ఉన్న పాకిస్తాన్ ఏదో పోయినట్టుగా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.  


అంతర్జాతీయంగా ఇండియాపై కంప్లైంట్ చేసింది.  చైనాను బతిమిలాడుకొని భద్రతా మండలిలో కంప్లైంట్ చేసింది.  దీనిపై భద్రతా మండలి సమావేశం అయ్యింది.  ఈ సమావేశంలో కశ్మీర్ అంశం గురించి చర్చించారు.  చివరకు ఇది ద్వైపాక్షిక అంశం అని.. ఆ రెండు దేశాలే తేల్చుకోవాల్సిన అంశం అని చెప్పడంతో పాపం పాక్ కు ఏం చేయాలో అర్ధం కాలేదు.  అక్కడితో ఆగకుండా ఎల్ ఓ సి వద్ద కాల్పులకు తెగబడింది.  దీనికి ఇండియన్ ఆర్మీ ధీటుగా సమాధానం ఇచ్చింది.  


ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.  ఇండియా ఎన్ఆర్సి, అణ్వస్త్ర విధానంపై అయన మాట్లాడారు.  ఇండియా అణ్వస్త్ర విధానం భయపెట్టే విధంగా ఉందని, దీని వలన పాక్ కు ముప్పు వాటిల్లుతుందని, అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై పట్టించుకోని భారత్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నది.  అసలు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక పాక్ ఉద్దేశ్యం ఏంటి.  ఏదో విధంగా ఎల్ ఓ సి వద్ద సందు చూసుకొని ఉగ్రవాదులను ఇండియాలోకి పంపి విద్వాంసం సృష్టించాలని చూస్తోంది.  ఇదే పాక్ లక్ష్యంగా పెట్టుకుంది.  అందుకే ఆ దేశం ఇంకా వెనకబడి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: