గత ఎన్నికల్లో బాబు ఎలాగైనా తెలుస్తారని అనుకున్నారు.  పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని భావించారు. అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి.  పార్టీ ఘోరంగా ఓడిపోయింది.  ఎప్పుడు లేనంతగా పరాజయం పాలైంది.  పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు.  ఎవరూ ఊహించని విధంగా వైకాపా విజయం సాధించింది.  ఏకంగా 151 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది.  


కేవలం 23 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకోగలిగింది. మరోవైపు కేంద్రంలో బీజేపీకూడా బలంగా మారింది.  రెండోసారి అధికారంలోకి వచ్చింది.  2014లో కంటే 2019 లో బీజేపీ బలం పుంజుకుంది.  ఇది ఆ పార్టీకి కలిసి వచ్చింది.  బలహీనమైన తెలుగుదేశం పార్టీలోని చాలామంది నేతలు ఇప్పటికే ఫిరాయించారు.  బీజేపీలోకి జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.  


ఇది వేరే విషయం అనుకోండి.  జగన్ అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం లేదు.  కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  వరసగా కొత్త కొత్త పధకాలు ప్రవేశపెడుతున్నారు.  ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన జగన్.. చెప్పినట్టుగా గ్రామ వలంటీర్ల ఉద్యోగాలను కల్పించారు.  4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన జగన్ చెప్పినట్టుగా 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు.  మరికొన్ని త్వరలోనే పూర్తికానున్నాయి.  


చెప్పింది చెప్పినట్టుగా జగన్ చేస్తుండటంతో బాబుకు ఇబ్బందికరంగా మారింది.  తెలుగుదేశం పార్టీకి బలమైన యువనాయకత్వం కావాలని బాబు ఆలోచిస్తున్నాడు.  ఈ సమయంలో నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించలేరు.  లోకేష్ కు అప్పగిస్తే.. ఏం జరుగుతుందో బాబుకు తెలుసు.  అందుకే బాబు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్నారని సమాచారం.  భవిష్యత్తులో జగన్ ను ఎదుర్కొనాలి అన్నా.. పార్టీకి తిరిగి జవసత్వాలు నింపాలి అన్నా ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం అవుతుందని బాబు భావిస్తున్నారు.  ఎలాగైనా ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్.  అయితే, ఎన్టీఆర్ మాత్రం సినిమాలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు.  మరి బాబు కోసం, పార్టీ కోసం ఎన్టీఆర్ త్యాగం చేస్తారా చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: