2008 వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలనుంచి పక్కకు తప్పుకొని ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.  2009 లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసి 18 సీట్లు సాధించింది.  ఆ తరువాత జరిగిన అనేక పరిణామాల ఫలితంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.  కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ.. పోటీ చేసిన ప్రజారాజ్యం.. తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ కావడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు.  అలా కాకుండా మెగాస్టార్ కొన్నాళ్ళు నిలబడి ఉంటె.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా అధికారంలోకి వచ్చి ఉండేది.  


కానీ, మెగాస్టార్ అప్పట్లో తొందరపడి విలీనం చేశారు.  ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.  కొన్నాళ్ళు కేంద్రమంత్రిగా పనిచేశారు మెగాస్టార్.  మెగాస్టార్ కు మంచి ఛరిష్మా ఉన్నది.  తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు.  ఇప్పుడు మెగాస్టార్ తిరిగి పోటీ చేసిన ఖచ్చితంగా గెలుస్తారు అనడంలో సందేహం అవసరం లేదు.  


ఏడేళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైనా మెగాస్టార్, ఖైదీ నెంబర్ 150 తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  ఆ సినిమా బంపర్ హిట్ అయ్యింది.  ప్రస్తుతం సైరా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం కాబోతున్నది.  ఈ సమయంలో మెగాస్టార్ పై ఒత్తిడి మొదలైంది.  దేనిగురించో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి తమ పార్టీలో జాయిన్ కావాలని కొంతమంది నేతలు ఒత్తిడి చేస్తున్నారు.  


అలా ఒత్తిడి తెస్తున్న పార్టీ ఏంటో ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటుంది.  అదే బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తున్నది.  ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న ఆ పార్టీకి ఛరిష్మా కలిగిన నేతల అవసరం ఎంతైనా ఉన్నది.  అందుకే మెగాస్టార్ ను పార్టీలోకి తీసుకోవాలని ట్రై చేస్తున్నది.  కానీ మెగాస్టార్ మాత్రం తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు ససేమిరా అంటున్నాడు.  అయినా సరే బీజేపీ పట్టువదలడం లేదు.  మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కూడా గాలం వేస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: