కలియుగ దైవం శ్రీనివాసుడు వెలసిన పుణ్యక్షేత్రం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే దివ్య క్షేత్రం స్వామి వారి దర్శనం కోసం విచ్చేసే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం.పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండు వేల మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద పథకం ప్రవేశపెట్టింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ మాటను నిజం చేసి చూపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం లక్షా అరవై వేల మంది భక్తు లకు అన్నప్రసాదం సౌకర్యాన్ని కల్పిస్తోంది.ప్రతి రోజు ఇరవై ఐదు టన్నల బియ్యం, ఎనిమిది టన్నల కూరగాయలను అన్న ప్రసాద పథకానికి వినియోగిస్తున్నారు. భక్తులు సమర్పిస్తున్న కానుకలతో అన్న ప్రసాద పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు టిటిడి  అధికారులు. ఇంతింతై వటుడింతై అన్నట్టు గా ఇప్పుడు నిత్యం లక్ష అరవై వేల మంది భక్తు లకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందించే స్థాయికి చేరుకుంది టీటీడి. పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి ముఖ్య మంత్రి ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అన్న ప్రసాద పథకాన్ని ప్రారంభించింది టిటిడి. మొదట రెండు వేల మంది భక్తులకు పులిహోరను అందించడం ప్రారంభించారు. తరువ


ాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి భక్తులకు ప్రతి నిత్యం మధ్యాహ్నం రాత్రి వేళలో ఉచితంగా భోజనం అందించారు. రెండు వేల ఏడు వరకూ కూడా శ్రీవారిని దర్శించు కున్న భక్తులకు మాత్రమే ఉచిత అన్నప్రసాదం అందిస్తూ వచ్చింది. అప్పటి ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనంతో సంబంధం లేకుండా అన్నప్రసాదం అందించడం ప్రారంభించారు. దీనితో అప్పటి వరకు ప్రతి నిత్యం నలభై వేల మంది భక్తులకు అన్న ప్రసాద భాగ్యం లభిస్తోండగా నూతన విధానంతో అన్నప్రసాదా సౌకర్యం వినియోగించు కునే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది. అప్పటి వరకు ఉన్న అన్న ప్రసాద భవనంలో సరిపడినంత స్థలం లేకపోవడంతో ఆసియాలోనే అతిపెద్ద అన్నప్రసాదా భవనాన్ని ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి అన్న ప్రసాద సముదాయం నిర్మాణంలో ఒక్క విడత లో నాలుగు వేల మంది భక్తులకు అన్నప్రసాదాన్ని టిటిడి అందించడం ప్రారంభించింది. దీనితో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు కూడా స్వామి వారి ప్రసాదాన్ని అన్న ప్రసాద సముదాయంలో స్వీకరించటం ప్రారంభించారు. ఇక అన్న ప్రసాద పథకం నిర్వహణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద ట్రస్టుకు దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.


పంతొమ్మిది వందల ఎనభై ఐద లో ఎల్లీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన అయిదు లక్షల రూపాయల విరాళం తో ప్రారంభమైన అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పుడు పదకొండు వందల కోట్ల రూపాయల విరాళాలుగా అందించారు భక్తు లు. ముప్పై ఏడు వేల నూట అరవై తొమ్మిది మంది భక్తులు లక్షకు పైగా విరాళాన్ని అన్న ప్రసాద పథకానికి అందించారంటే అన్న ప్రసాద పథకానికి భక్తుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎంతో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏటా అన్న ప్రసాద పథకానికి వంద కోట్లకు పైగా విరాళాలు అందుతుండటంతో అన్న ప్రసాద పథకాన్ని కూడా టీటీడీ అదే స్థాయి లో విస్తరిస్తోంది. అన్న ప్రసాద సముదాయంతో పాటు భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లతో పాటు క్యూలైన్ లు యాత్రికుల వసతి సముదాయం తిరుపతిలోని అతిథి గృహాల్లో కూడా అన్నప్రసాదా సౌకర్యం కల్పిస్తోంది.


టీటీడీ బ్రహ్మోత్సవాల సమయంలో అనుబంధ ఆలయాల వద్ద కూడా భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తోంది. ఇక తిరుచానూరు అమ్మ వారి ఆలయం వద్ద కూడా శ్రీ వారి ఆలయం తరహాలోనే భక్తులకు అందించేందుకు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో అన్న ప్రసాద సముదాయాన్ని నిర్మిస్తోంది. టీటీడీ అన్న ప్రసాద పథకాన్ని పూర్తిగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న టీటీడీ ఇప్పుడు ముడిసరుకులు కొనుగోలుపై కూడా దృష్టి సారించింది. ప్రధానంగా బియ్యం కూరగాయలను కొనుగోలు చేయకుండా దాతల నుంచి సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇప్పటికే ప్రతి నిత్యం ఎనిమిది టన్నుల కూరగాయ లను దాతల నుంచి సేకరిస్తోంది గత పదహారేళ్లు గా కూరగాయులను ఆంధ్ర తమిళనాడులోని దాతలు అందిస్తున్నారు. ఇక బియ్యం కూడా నేరుగా రైసు మిల్లర్ల నుంచి సేకరిస్తోంది టీటీడీ. మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధరకే మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తోంది.


మరోవైపు కూరగాయలు అందిస్తున్న దాతలతో సమావేశం నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి మూడు వందల డెబ్బై ఐదు క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందించేలా మిల్లర్ లను ఒప్పించారు. ఇక పై బియ్యం కొనుగోలు సమయంలో మిల్లర్లు తమ వంతు సహాయంగా ఉచితంగా బియ్యాన్ని టీటీడీకి అందించాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి రానున్న రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోళ్లు కంటే ఉచితంగా అంతే బియ్యం ఎక్కువ నాణ్యంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇక కూరగాయలు అందించిన దాతలు కూడా నాణ్యమైన కూరగాయలను అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో భక్తులకు నాణ్యమైన భోజనాన్ని అందించే వెసులుబాటు టీటీడీకి లభిస్తుంది అని ఆయన వెల్లడించారు. ఈ నిత్య అన్నదాన పధకం ఎల్లప్పుడు ఇలానే కొనసాగుతూ ప్రతి ఒక్క భక్తుడికి అన్న ప్రసాదం లభించాలని టీటీడి అధికారులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: