14 రోజుల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఇప్పుడిప్పుడే  పరిస్థితి  సాధారణ స్థితికి వస్తుంది. సోమవారం  రోజు  పాఠశాలలను దశల వారీగా రీ ఓపెన్ చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీనగర్ లో 900 స్కూల్లకు గాను ప్రస్తుతం 190 పాఠశాలలు తెరుచుకున్నాయి.   అయితే తమ పిల్లలను స్కూల్ కు పంపించడానికి మాత్రంతల్లిదండ్రులు   వెనుకడువేస్తున్నారని సమాచారం.  ఇక భద్రతా పరమైన ఇబ్బందులతో  ప్రైవేట్ సూళ్లు మాత్రం పూర్తిగా మూతబడ్డాయి.  ఇక ఈవిషయంపై శ్రీనగర్ డిప్యూటీ కమిషనర్ షాహిద్ ఇక్బల్ స్పందిస్తూ...  ఎక్కడెక్కడైతే పాఠశాలలు తెరుచుకొన్నాయో ఆ పాఠశాలలకు మీ పిల్లల్ని పంపించండి భద్రతాపరమైన హామీ మేము ఇస్తామని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. 




కాగా కశ్మీర్ తో పోలిస్తే జమ్మూ లో చాలా చోట్ల  పరిస్థితి నార్మల్ గానే వుంది.  జమ్మూ లోని 5జిలాల్లో 2జి ఇంటర్నెట్ సేవలను పున ప్రారంభించారు. అలాగే  మొదటి నుండి మొబైల్ , ల్యాండ్ లైన్ సేవలు  అందుబాటులో వున్నాయని  సోమవారం నుండి  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోనున్నాయని  జమ్మూ -కశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రోహిత్ కాన్సల్  జాతీయ మీడియా కు వెల్లడించారు. 




ఇక కశ్మీర్ లో మాత్రం  ముందెన్నడూ లేనంత స్థాయిలో భద్రతాపరమైన ఆంక్షలు అమలవుతున్నాయి.  స్థానిక రాజకీయ నాయకులు సహా వందల మందిని ప్రభుత్వం నిర్బంధంలో ఉంచింది.   కశ్మీర్‌లో ఇంటర్నెట్, ఇతర సమాచార వ్యవస్థలను స్తంభింపజేశారు.  అయితే ల్యాండ్  లైన్ టెలిఫోన్ సర్వీసులను పాక్షికంగా  పునరుద్దీకరిస్తున్నారు.  మొబైల్స్ ఫై నిషేధం కొనసాగుతూనే వుంది. ఇక కశ్మీర్ లోయలోని  పోలీస్ స్టేషన్ల  పరిధి ప్రాంతాల్లో  ఆంక్షలు  సడలించారు. కాగా ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: