బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ సరికొత్త వాదానికి తెర లేపారు. కశ్మీర్ సమస్యను సులువుగా పరిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ పేరును ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి పెట్టాలని డిమాండ్ చేశారు. దేశానికి ఎంతో మేలు చేస్తున్న మోడీ అందుకు అర్హుడని సమర్ధించుకున్నారు.

నార్త్ వెస్ట్ ఢిల్లీ బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ ప్రధాని మోడీని ఆకాశానికేత్తేసారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో  ఇటీవల ఏబీవీపీ నిర్వహించిన అమరవీరుల స్మృతి  కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ హన్స్ రాజ్  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో కల్లోలానికి  నెహ్రు - గాంధీ విధానాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రత్యేకించి కశ్మీర్ విషయంలో నెహ్రు అనేక తప్పులు చేశారని విమర్శించారు. 

ప్రధాని మోడీ చాకచక్యం వల్లే కశ్మీర్ సమస్య పరిష్కారమైందని,  ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని హన్స్ రాజ్ హన్స్ వ్యాఖ్యానించారు. మరోసారి బాంబుల మోత లేకుండా,  ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుకున్నారు.జేఎన్ యూ గురించి చాలా విన్నానని కామెంట్ చేసిన హన్స్ రాజ్, మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యూనివర్సిటీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. దేశాభివృద్ధికి ఎంతో మేలు చేస్తున్న మోడీ పేరున మోడీ నరేంద్ర యూనివర్సిటీగా జేఎన్ యూకు నామకరణ చేయాలని ముక్తాయించారు. జేఎన్ యూ కి మోడీ పేరు పెట్టాలన్న హన్స్ రాజ్ హన్స్ ప్రతిపాదనని లైట్ తీసుకున్నారు మరో ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ. ఆయన మోడీ మీద గౌరవంతోనే మనసులో భావనని భయటపెట్టారే తప్ప, అలా చేయాల్సిన అవసరం లేదని సర్ధి చెప్పారు మనోజ్ తివారీ.  










మరింత సమాచారం తెలుసుకోండి: